Showing posts with label లేహ్యాలు. Show all posts
Showing posts with label లేహ్యాలు. Show all posts

Tuesday, May 5, 2009

ఏలాది లేహ్యం

చిన్న ఏలకులు, ఆకుపత్రి, దాల్చినచెక్క, సన్నపిప్పళ్ళు ఒక్కొక్కటి 20గ్రా చొప్పున తీసుకోవాలి. అతిమధురం, గింజలు తీసిన ఎండుకర్జూరాలు, గింజలు తీసిన ద్రాక్ష, ఎండుకిస్ మిస్ పండ్లు, ఇవి ఒక్కొక్కటి 40 గ్రా చొప్పున తీసుకోవాలి.

తయారీ విధానము :
పైన తెలిపిన పదార్ధాలను పొడి చేసుకొనవలసిన వాటిని మెత్తగా దంచి పొడిగా మార్చుకోవాలి. ఆ పొడులను మిగిలిన పండ్లను మొత్తము కలిపి రోటిలో వేసి అన్నీ పదార్ధాలు బాగా కలిసిపోయేవరకు దంచి ఆ ముద్దలో తగినంత పట్టుతేనే కలిపి మళ్ళీదంచి లేహ్యంలాగా చేసి ఒక గాజుపాత్రలో నిలువ ఉంచుకోవాలి.

మోతాదు :
రోజూ రెండుపూటలా పూటలకు 10గ్రా మోతాదుగా తినాలి.

ఉపయోగాలు :
దగ్గు, ఉబ్బసము, జ్వరము, ఎక్కిళ్ళు, వాంతులు, మూర్చ, రక్తపైత్యము, అతిదాహము, నోటిలో రుచిలేకపోవడం, క్షయరోగము, కడుపులో బల్లలు పెరగటం, కీళ్ళవాతము, బొంగురుగొంతు మొదలైన సమస్యలున్నవారు దీనిని ఉపయోగించుకొని ఆయా సమస్యల నుండి విముక్తిపొందడమేకాక శరీరానికి మంచి బలము పుష్ఠి, వీర్యవృద్ధి కూడా కలుగుతాయి.

సేకరణ : అందరికి ఆయుర్వేదం ఫిబ్రవరి 2008