Showing posts with label ఇతరములు. Show all posts
Showing posts with label ఇతరములు. Show all posts

Thursday, May 21, 2009

నత్తిని పోగొట్టే బిరియాని ఆకు

  • బిరియాని ఆకుని ఆకుపత్రి అంటారు. దీనిని నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటే నత్తి తగ్గుతుంది.
  • బాలింతలకు పాలు పెరిగేలా చేస్తుంది.
  • ఋతుస్రావం సక్రమంగా అయ్యేలా సహాయపడుతుంది.
  • బట్టల అలమారలలోను, బట్టల మధ్య బిరియాని ఆకు ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.

(సేకరణ)

Friday, May 15, 2009

రోగాలపై జీలకర్ర

జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.

జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి.

ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు, జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది.

ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకు దూరంగా ఉంటారు.

(సేకరణ)

Friday, January 9, 2009

పొట్ట తగ్గడం కోసం

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మబద్ద రసం పిండి ఒక స్పూన్ తేనె కలిపి త్రాగాలి.

సేవించే విధానం :
రోజుకు మూడు సార్లు త్రాగాలి. కానీ, ఇది త్రాగే ఒక గంట ముందు ఏమి తిని ఉండకూడదు. అలాగే త్రాగిన ఒక గంట తర్వాత కూడా ఏమి తినరాదు.

ఇది మొదలు పెట్టిన మొదటి రోజున ఒక పూట మాత్రమే అంటే ఉదయం పరగడుపున త్రాగాలి.
రెండవ రోజు పైన చెప్పిన విధంగా ఉదయం మరియు రాత్రి త్రాగాలి.
మూడవ రోజు ఉదయం, మధ్యాహ్నం, మరియు రాత్రి త్రాగాలి.

ఉదరంలో ఏమైనా సమస్యలున్నవారు చిన్న గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు నిమ్మబద్ద రసం మరియు సగం స్పూన్ తేనె కలిపి త్రాగవచ్చు.

నీరు మరీ ఎక్కువగా వేడి చేయరాదు... గోరువెచ్చగా మాత్రమే ఉండాలి.

ఏల్చూరి గారి జీ-తెలుగు 9-1-2009 కార్యక్రమం నుంచి సేకరించినది.

Saturday, November 22, 2008

ఉదర సమస్యలకు సాంబారు పొడి

ఇంగువ, వాము, జీలకర్ర, సొంఠి, మిరియాలు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకొని పొడిచేసుకోవాలి.
ఇంగువను మాత్రం పొంగించి పొడిచేసుకోవాలి.తగుమాత్రంగా సాంబారు, చారు, పప్పు, ఇగురుకూరల్లో వేసుకోవాలి