Showing posts with label నా రాతలు. Show all posts
Showing posts with label నా రాతలు. Show all posts

Friday, January 8, 2010

దూరదర్శన్ కు పూర్వవైభవం!!!???

ఈ మధ్య ఛానల్స్ లో వస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల అందరూ దూరదర్శన్ చాలా నయం అనే పరిస్థితికి వచ్చారు. కొన్ని బ్లాగుల్లో కూడా దాదాపు అవే భావాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ టపా వ్రాయడానికి కారణం ఈ రొజు TV9లో చూసిన న్యూస్ వాచ్ కార్యక్రమం.

దివంగత ముఖ్యమంత్రి YSR హత్య కుట్ర వగైరాలా గురించి నిన్న కొన్ని ఛానల్స్ చూపిన అత్యుత్సాహం గురించి రజనీకాంత్ + అతిధులు మీడియా ఎలాంటి వార్తలు ప్రసారం చేయాలి?? జర్నలిజం నియమాలు వగైరాలా గురించి చర్చిస్తున్నారు. ఆసక్తి లేకపోయినా ఏదో వింటున్నా.

కార్యక్రమం చివరాఖరున ఓ జోక్ పేలింది.. కోమటరెడ్డి రాజగోపాలరెడ్డి MP గారు.. వాళ్ళ రాజినామాల గురించి TV5కు ఇంటర్యూ ఇచ్చారంట.. వీళ్ళు ఇంకా ఓ నిర్ణయానికి రాకముందే TV5లో రాజినామాల గురించి తప్పుగా స్క్రోలింగ్ వేసారంట. తర్వాత TV9లో NTVలో వేసారంట. ఏంటి అని TV9, NTV కి కాల్ చేస్తే TV5 వాళ్ళు వేస్తున్నారుగా అందుకే మేము వేస్తున్నాం అన్నారంట..

అపుడు కోమటరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు .... ఓ 6 నెలలు ఈ ఛానెల్స్ అన్ని ఆపేసి దూరదర్శన్ లో శాంతిస్వరూప్ ను తీసుకువస్తే 6 వరకూ ఉండి మళ్ళీ పొద్దున్న వస్తాడు.. అని చెప్పారు. రజనీకాంత్ ఉన్నాడని కూడా లేకుండా TV9 స్టూడియోలో ఉండి TV9 వాళ్ళనే గిల్లారు.

మాకు తెలిసినవాళ్ళు టి.వి. కొన్న దగ్గరనుండి ఎంచక్కా దూరదర్శన్ నే చూస్తున్నారు. వాళ్ళకు 55 సంవత్సరాల వయస్సు. కానీ వాళ్ళకు ఇప్పటివరకు షుగర్, బి.పి లాంటివి ఏమీ లేవు. ఇది వరకు మేము వాళ్ళను మూర్ఖులుగా చూసేవాళ్ళం. కానీ అసలు ఒక్కొసారి ఇన్ని ఛానల్స్ పిచ్చెక్కుంది. నేను దూరదర్శన్ మారడానికి రెడీ... ఇంట్లో వాళ్ళు డౌటే

ఆ మధ్య TV5 వాళ్ళు అమృతాన్ని తాగించారు.. ఏదో తివారీ తాత లాంటివాళ్ళు తప్ప మామూలు జనాలు పాపం ఏం ఆరాయించుకుంటారు!! బ్లాగుల్లోనే చాలామంది భళ్ళున కక్కేసారు. సినిమాల్లో అక్కడక్కడా వచ్చేవాటినైనా చూడగలుగుతారేమో కానీ... అన్ని ఒకే చోట పేర్చి మాంచి మసాలా చేసి జనాలకు తినిపిస్తే.. అంతకుముందే కొన్ని ఛానల్స్ తినిపించిన మసాలా మొత్తం ఎక్కువై అందరికి కడుపుల్లో ‘మంట’లు ఎక్కువయ్యాయి.

ఏదో వారానికి ఒక సినిమా, అరగంట చిత్రలహరి, ఓ గంట లేదా రెండు గంటలు సీరియల్స్, అరగంట వార్తలు. ప్రాణానికి హాయిగా ఉంటుందని ఇపుడు అనిపిస్తుంది. ఏం చేస్తాం కడుపులో మంట తగ్గాలంటే మసాలా తగ్గించుకొని మనమే మెనూ మార్చుకోవాలి. ఇలా మెనూ మార్చే క్రమంలో అందరూ మళ్ళీ దూరదర్శన్ కే మారితే, మళ్ళీ అందరి ఇంటి కప్పుల పైనా యాంటెన్నా తల ఎత్తుకొని cable, DTHలను వెక్కిరిస్తూ కనపడుతుందేమో!!

చూద్దాం మా ఇంటి వాళ్ళను నేను ఎంతవరకూ మార్చగలనో!!!

Thursday, November 12, 2009

గుండె మాత్రం నీ జ్ఞాపకాలతో కొట్టుకుంటుంది.


దారిలోని గులకరాయిని ముందుకు దొర్లిస్తూ
నీ జ్ఞాపకాల దారిలో నా మనసును వెనుకకు మళ్ళిస్తూ..
ఒంటరిగా నడుస్తున్నా....
నా తలపుల్లో నీ అడుగులు నాతో కలసి నడుస్తున్నాయి.
నీ జ్ఞాపకాలు కన్నీళ్ళుగా కరుగుతున్నా...
పదిలంగా నాతోనే ఉంటానంటూ మళ్ళీ నా గుండెలో ఇంకుతున్నాయి.
భౌతికంగా మరణించి
ఆకాశంలో చుక్కలా నువ్వు
మనసు చచ్చి
రెక్కలు తెగిన పక్షిలా నేను
నీతో పాటే నేను చనిపోయాను
గుండె మాత్రం నీ జ్ఞాపకాలతో కొట్టుకుంటుంది.

Tuesday, September 29, 2009

గంగిగోవు పాలు గరిటడైనను చాలు!!

ఆ మధ్య ఈ-టి.విలో మొదలైన ‘అక్షర’ సీరియల్ గురించి .. జూన్ లో మొదలై మొన్న శుక్రవారం (25-9-2009) అయిపోయింది. బాగా 1000, 2000 ఎపిసోడ్స్ కి అలవాటయిపోయిన బుర్రలు ఇంత తొందరగా.... అది ఇంత మంచి సీరియల్ అయిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. sedih

ఏడుపులు, పెడబొబ్బలు... లేడి విలన్లు, ఓవర్ యాక్టింగ్ లేకుండా... నిజంగా మనసును తాకిన మంచి సీరియల్. సీరియల్ సాంగ్ కూడా చాలా బాగుంది. మొన్న శుక్రవారం టకటకా సీరియల్ అంతా అయిపోయే సరికి .... అయ్యే అపుడే అయిపోయిందా?? అని ఉసూరుమనిపించింది. xpasti అమ్మమ్మ డాట్ కామ్ సీరియల్ అయిపోయినపుడు కూడా ఇలానే అనిపించింది. ఈ సీరియల్ పాట కూడా చూడటానికి చాలా బాగుండేది. అమృతం సీరియల్ చాలా ఎపిసోడ్స్ అయినా కూడా ఇంకా నవ్విస్తే బాగుణ్ణు అనిపించింది.

నిజంగా కొన్ని సీరియల్స్ బాగుంటాయి అనిపించింది. senyumkenyit

Monday, September 14, 2009

నువ్వు నిజంగా నా ఒడి చేరాలని...



నా కళ్ళు వెదుకుతూనే ఉన్నాయి
నీ కళ్ళతో నా కళ్ళు కలిసిన క్షణం నుండి..
నేను నిన్ను చూసినవేళ
కమ్మని కలలో కరిగిపోగా
కలలో నా ఒడిలో ఉంటావు
కనులు తెరిచిచూస్తే కదిలిపోతుంటావు
ఎక్కడున్నావో కనిపించకుండాపోతావు
కనిపించని నిన్ను కలలో ఊహించుకోనా?
నువ్వు కనిపించినపుడు కలలో కరిగిన నా వెర్రితనాన్ని తిట్టుకోనా?
మొత్తానికి ఏదో ఆశ ఎగసి నిరాశగా ముగిసిపోయింది
ముగిసినా కానీ మొదలవ్వాలని కోరుకుంటున్నా
నువ్వు నిజంగా నా ఒడి చేరాలని...

Monday, August 31, 2009

చిలకపచ్చ కోక పెట్టినాది కేక

హుమ్!!! నిన్న మధ్యాహ్నం నుండి మొదలయ్యింది వినాయకుని నిమజ్జానాల సందడి. సాయంత్రం అలా బజారు కెళ్ళేచ్చే సరికి కూడా ఇంకా సందడి తగ్గలేదు. చాలా వరకూ చిన్నపిల్లలు పెట్టిన వినాయకుళ్ళే. మరోచోట బాగా పెద్దగా ఉన్న వినాయకుడు మంచి బ్యాండ్ మేళం, సినిమా పాటలతో స్వామివారి చేవులకు విందు కలిగిస్తూ.... సింగర్ ‘‘ఇపుడు చిలకపచ్చ కోక పెట్టినాది కేక’’ పాట పాడతాను అని ఎనౌన్స్ మెంట్ చేస్తున్నాడు. xpasti

అసలు వినాయకుడి నిమజ్జనం ఏంటి??? దానిలో ఈ చిలకపచ్చ కోకలు కేకలు పెట్టడం ఏంటో?? garupaleఆ క్రిందటి సంవత్సరం అనుకుంటా!! బాగా గుర్తు... పొద్దున్నే కూరగాయలు కొనడానికి వెళితే... అంటే సుమారు 6 గంటలకన్న మాట... పాపం స్వామి వారి దగ్గర ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాట ప్లే చేసారుadus. బొలేడు భక్తిపాటలు ఉంటాయి. శ్లోకాలు ఉన్నాయి. అవి కాకుండా మరీ పొద్దున్నే ఇలాంటి పాటలతో స్వామిని ఈ విధంగా రంజింపచేయడం. ఇదేమైనా పెళ్ళి వేడుకనా??? ఇలాంటి పాటలు పాడటానికి!!! దేవుడు అంటే ఎంత భక్తిశ్రద్ధలతో, నిష్టగా చేయాలి. ప్రతిఒక్కళ్ళు చందాలు పొగేయ్యడం. ఒక్కో వీధికి సుమారు చిన్న, పెద్ద ఓ 10 వినాయక విగ్రహాలు పెట్టడం. ఇలాంటి సినిమా పాటలు పెట్టి ఆ భక్తి భావాన్ని ఇలా చెండాలం చెయ్యడం... దైవం ఉన్న ప్రదేశం అంటేనే ఓ రకమైన ప్రశాంతత, భక్తి భావం వచ్చే విధంగా ఉండాలి. పేరుకు వినాయకుడు... కానీ మనుషులే అక్కడ నాయకులు. వారికి నచ్చిన పాటలు, డ్యాన్సులు, గోల, bisingపలహారాల రూపంలో ఉండే ప్రసాదాలు..tension

క్రిందటేడు... బాగా రద్దీగా ఉన్న బజారులో వినాయక నిమజ్జన సంబరాలు జరుగుతున్నాయి. ఆ గుంపులో ఉండే మగవాళ్ళు ఆ రద్దీలో వెళ్ళలేక ఇరుక్కొని ఎలాగో బయటపడదాం అనే ఆడవారిని కావాలని తాకుతూ డ్యాన్సులు వేస్తున్నారు. ఇంక ఎవరిని ఏమీ అడగలేని పరిస్థితి... వినాయక చూస్తున్నావా?? ఈ చేతలు... వింటున్నావా??? ఈ పాటలు...doa

Tuesday, July 7, 2009

బ్లాగర్లు మీరు ఏమీ డైట్ తీసుకుంటారు?

ముఖ్యంగా ఇది బాగా ఎక్కువ టపాలు రాసేవాళ్ళను, ఎక్కువ కామెంటేవాళ్ళను చూస్తే వచ్చే ప్రశ్న ఇది. నాకైతే ఓ రెండు, మూడు టపాలు చదివితే తలనొప్పి, కళ్ళు లాగడం మొదలెడతాయి. blur తలనొప్పి అంటే టపాలో ఉండే విషయం వల్ల వచ్చేది కాదు. నా శారీరక బలహీనత. అందుకే ఏదైనా టపా చూస్తే క్రింద కామెంట్లను చూసి వాటిలో కేక, సూపర్, అదుర్సు వంటివి ఉంటే ప్రింటవుట్ తీసుకొని చదువుతా sengihnampakgigi. మరీ ఎక్కువ కేకలు ఉన్న టపాలు ఇలా ప్రింటవుట్ తీసుకొని చదివితే మా బాస్ నన్ను కేకలేస్తారు.. nangih


కొంతమంది అయితే టపాలు ఏమీ రాస్తారో కానీ... ప్రతి బ్లాగు తెరిచిన వారి కామెంటు తప్పక ఉంటుంది. టైపు చేసి, టపా చదివి చేతులు, కళ్ళు నొప్పులు రావా?? ఏమీ డైట్ తీసుకుంటారో చెబుదురూ కాస్త!!! gigil బ్లాగు రాయడానికి కాకపోయినా... ఆఫీస్ లో వర్క్ అయినా నొప్పులు లేకుండా చేసుకుంటా. లేదా వీరంతా బ్లాగడానికి ఎడిక్ట్ అయ్యారనుకోవచ్చా??? sembah


పోనీ ఇంత కష్టపడితే ఈ బ్లాగడం వల్ల డబ్బులు వస్తాయి కష్టపడచ్చు అనుకుంటే అదీ లేదు. ఇలా అనుకున్నా నేను మాత్రం బ్లాగు రాయడం ఆపి ఏడ్చానా ఏంటీ?? ihikhik ఒకసారి బ్లాగు డిలీట్ చేసి మళ్ళీ మొదలుపెట్టా... ఎడిక్ట్ మాత్రం కాలేదులెండి... కానీ ఒకనొక సందర్భంలో అంతవరకూ వచ్చింది. ఇదివరకు పని ఉన్నా, లేకున్నా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా కూడలిని ఓపెన్ చెయ్యడం జరిగేది. ఈ మధ్య ఇది తగ్గింది. బ్లాగడం కూడా తగ్గింది. పూర్తిగా ఇటు వైపుకు రాకుండా ఎపుడు ఉంటానో??doa

Wednesday, June 24, 2009

గత జన్మలో నేనేవరు? :-(

http://www.thebigview.com/pastlife/


ఈ వెబ్ సైట్ గత జన్మలో మీ వృత్తి ఏంటి? మీరు ఆడ, మగ? ఏ సంత్సరంలో పుట్టారు? వగైరాలన్నీ చెబుతుంది. నమ్మకం సంగతి పక్కన పెడితే సరదాగా టెస్ట్ చేసుకోవచ్చు కదా!! నిజమేంతో, అబద్ధమెంతో భగవాన్ జానే?? garupale


నేను 1675లో పుట్టానంట!!!hah వామ్మో. అప్పటి నుండి మొన్న నేను పుట్టేవరకూ నా ఆత్మ ఎక్కడ తిరిగిందో!!blur నాకు ఏంటో గత జన్మ లక్షణాలు, ఇప్పటి లక్షణాలు ఒకేలా వచ్చాయి అలాగే జెండర్ కూడా ఒకటే. sengihnampakgigi


22-06-2009 రోజున TV9లో వచ్చిన ధర్టీ మినిట్స్ ప్రోగామ్ చూసి సరదాగా ఈ వెబ్ సైట్ ప్రయత్నించా!! kenyitkenyitkenyit

Monday, June 8, 2009

ఈ వర్షం సాక్షిగా....

బాగా చలిగా అనిపిస్తుంది. ఎండకాలంలో ఇంత చల్లగా ఉందేంటని? ఆ నిద్రమత్తులోనే దుప్పటిని కాళ్ళ నుండి ముఖం మొత్తం కప్పేసుకున్నాను. అసలే ఆదివారం ఏ పని చురుకుగా చెయ్యబుద్దేయ్యదు. బద్ధకంగా అనిపిస్తుంది. ఏంటో మరి!!!! అలాగే నిద్ర కూడా ఆలస్యంగా లేచి బద్ధకంగా ఆవులిస్తూ కిటికి వైపు చూసాను. నా చలికి కారణమేంటో అపుడు తెలిసింది. బయట వర్షం పడుతుంది.

ఈ ఎండల్లో మండి మండి ఆ చల్లదనం... వర్షాన్ని చూసేసరికి ఆహా!!! ఓహో!!!! బయటకెళ్ళి డాన్స్ చెయ్యాలనిపించింది. కానీ, చూట్టూ ఉన్న జనాలు చూస్తే బాగోదని ఊరుకున్నా.... బయట నేలపై పచ్చిక, చెట్లు... అన్నీ నాలాంటి సంతోషాన్నే అనుభవిస్తున్నట్టు అనిపించింది. వాటిని చూసి కాసేపు అసూయ పడ్డాను... ఎందుకంటే అవి హాయిగా వర్షంలో తడుస్తున్నాయి.. నీకా ఛాన్స్ లేదులే వ్వె వ్వె వ్వె అని అవి వెక్కిరిస్తున్నట్టు అనిపించి బాధపడ్డాను. కాసేపు అలాగే కిటికి చువ్వలు పట్టుకొని..... వర్షాన్నే చూస్తూ కూర్చున్నా...

ఇంక సరే తప్పదన్నట్టు లేచి బ్రష్ చేసి కాస్త టీ డాకాక్షన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం చేర్చి... అది పట్టుకొని మళ్ళీ కిటికి దగ్గర కొచ్చి వర్షాన్ని, చెట్లను చూస్తూ కూర్చున్నా.... టీ అయిపోయింది.... ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే .... చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తోచ్చాయి... అంతే న్యూస్ పేపర్లు పోగేసి....కాగితంతో పడవలు చేసా... మొదట ఎలా చెయ్యాలో గుర్తురాలేదు... మర్చిపోయా... కాసేపు కుస్తీ పడితే గుర్తుకొచ్చింది. స్లాబు పై నుంచి కారుతున్న నీటివల్ల ఇంటి గుమ్మం ముందు చిన్న కాలువలా తయారయింది. పడవలన్నీ వదిలాను... ఇంట్లో నుండి ఓ మూడు గిన్నెలు తెచ్చా... స్లాబు పై నుండి పడుతున్న ధార కింద పెట్టా... ఖాళీగా ఉన్న గిన్నెలో వర్షం పడుతున్నపుడు ఓ రకమైన సౌండ్, సగం నిండాకా ఓ రకమైన సౌండ్, పూర్తిగా నిండాకా ఇంకో రకమైన సౌండ్...

మరీ ఇలా ఉంటే బాగోదని.... స్నానం కాస్త ముగించి... ఇంక టిఫిన్ ఏమీ వద్దు... భోజనం వేళవుతుందని... వంట పని మొదలెట్టా.... అన్నం వండాను... ఇంట్లో కూరలేమీ లేవు... కొత్తావకాయ పచ్చడితో కానేచ్చేద్దాం అని అనుకున్నా. నాకు ఎప్పటినుండో ఒక కోరిక... బయట బాగా వర్షం దంచికొడుతుంటే.... ఏదైనా కారం కారంగా తింటూ... మంచి కామెడీ సినిమా చూడాలని.... వర్షం, కారం కారం, కామెడీ ఈ మూడింటిలో ఎపుడూ ఏదో ఒకటి మిస్ అవుతాను... ఏంటో నా అదృష్టం... ఏమీ తోచటం లేదని టి.వి. ఆన్ చేస్తే ఏదో ఛానల్లో అప్పుల అప్పారావు సినిమా వేస్తున్నాడు.. బయట వర్షం... ఇక గబగబా ఆవకాయన్నం కలిపి టి.వి. ముందు కూర్చున్నా....

రాత్రి నిద్రపోయే ముందు ఏదో గొప్ప సంతృప్తిగా అనిపించింది. హుమ్ మొత్తానికి ఈ రోజు వర్షంతో టైమ్ పాస్ బాగుంది. బాగా ఎంజాయ్ చేసా... ఇక రేపు సోమవారం ఉరుకులు, పరుగులు... తెల్లారి 5.30కు అలారం సెట్ చేసి నిద్రపోయా... రాత్రి నిద్రపోయేటప్పటికి వర్షం తగ్గినట్టు ఉంది. కానీ ఏ అర్ధరాత్రో మళ్ళీ మొదలయిందనుకుంటా...

పొద్దున్న అలారం గణగణలకు నిద్ర లేచేసరికి వర్షం బాగానే పడుతుంది... గబగబా పనులన్నీ చూసుకొని ఆఫీసుకు బయలుదేరాను. వర్షం తగ్గలేదు. దిక్కుమాలిన వర్షం ఛీ... హాండ్ బ్యాగ్, లంచ్ బాక్స్, ఈ రోజు గొడుగు ఎగట్రా మోత... రోడ్డు మీదకెళ్ళి చూద్దును కదా!!! నిన్నటి వర్షానికి, ఈ రోజు వర్షానికి కలిపి ఓ మాదిరి బురద... డ్రైనేజ్ పొంగిందేమో!! మొత్తానికి నా డ్రెస్ కు అంటకుండా బస్టాపుకెళ్ళి బస్సులో చూస్తే అందరి చేతుల్లో గొడుగులు... బస్ బాగా రష్ గా ఉంది.. దేవుడా...

ఎలాగొలా ఆఫీసులో పడ్డా... కానీ కాళ్ళంతా బురద... డ్రెస్ అటూ ఇటూ కొంచెం తడిచింది. సాయంత్రం వరకూ ఈ మాయదారి వర్షం ఇలాగే పడితే మోకాళ్ళ లోతు నీళ్ళలో ఈదుకుంటూ పోవాలి. ఛా!!! నా మీద నాకే చికాకు. ఆఫీసులో నా సీటులో కూర్చొని.... ఆలోచించా... నిన్న వర్షంతో ఎంజాయ్... ఈ రోజు ఇలా తిడుతున్నానేంటి?? అని.... ఈ లోపు మా ప్యూన్ వచ్చి అమృత మేడమ్ సార్ రమ్మంటున్నారు అని పిలిచాడు... ఇక వర్క్, ఫైల్స్, గోల...

Thursday, May 28, 2009

మూడ్ బాగోలేదా? అలసటగా, చిరాకుగా ఉందా? అయితే ‘జూజూ’ల కబుర్లు వినండి.

జూజూలంటే ఈ మధ్య వచ్చిన వొడాఫోన్ యాడ్ లో వచ్చిన గుండుబొమ్మలని మీ అందరికి తెలుసు. మొదట్లో వాటినేమంటారో తెలీక మా అమ్మ వాటికి పెట్టిన ముద్దు పేరు ‘గుండుబొమ్మలు’ surprised. మొన్న TV9 లో వాటి గురించిన ప్రోగ్రామ్ ఒకటి ప్రసారం చేసారు. IPL క్రికెట్ మ్యాచ్ మధ్యలో వచ్చే వొడాఫోన్ యాడ్ కోసమే ఆ మ్యాచ్ చూసినవాళ్ళ ఎక్కువట.

కానీ, నాకు తెలివితేటలు ఎక్కువ sengihnampakgigi అందుకే టి.విలో వేసేవరకూ ఎవరు వెయిట్ చేస్తారు. నాకు నచ్చినపుడు చూసుకోవచ్చని.. సుబ్బరంగా డౌన్ లోడ్ చేసి ఇంట్లో ఒక సి.డి. ఆఫీస్ లో ఒక సి.డి. పెట్టేసుకున్నా. ఒక్కొసారి మా ఇంట్లో ఏదో మూవీ సి.డి. చూసినట్లు కాసేపు ఆ యాడ్స్ సి.డి పెట్టుకొని చూస్తాము. నాకు ఆఫీస్ లో ఏదైనా వర్క్ టెన్షన్ ఉన్నా... లేదా కాసేపు రిలాక్స్ అవ్వాలన్నా... వేసేయ్ సి.డి.

ఏ యాడ్ ని తీసిపారేసేంత సాహసం నాకు లేకపోయినా.... కానీ, వాటిలో నాకు నచ్చిన కొన్ని.... senyumkenyitsenyumkenyit

వాయిస్ SMS - ఓ డబ్బా తీసుకొని గడగడా నాలుగు మాటలు చెప్పి ఇంకొ జూజూ నెత్తిన వేస్తుంది. దాంట్లో నచ్చింది... జూజూ గడగడ మాట్లాడి పకపక నవ్వడం... ఇంకో జూజూ నెత్తిన డబ్బా పడినపుడు ఉలిక్కిపడటం....

భక్తి సాగర్ - రెండు జూజూలు కొమ్మను పట్టుకొని వేలాడుతుంటాయి. పాపం వదిలితే కిందపడిపోతాయి. ఒకటి మాత్రం అరిచి గోల చేసి ఆఖరికి దణ్ణం పెట్టకొని కింద పడిపోతుంది. ఇంకోటి మాత్రం సెల్ ఆన్ చేసి భక్తిపాటలు వింటూ కొమ్మ వంక సెల్ వంక ఓ రకమైన అమాయకపు మొహం పెట్టుకొని చూస్తుంది.

బిజీ మెసేజ్ - ఓ జూజూ మొసలికి చేపను పెట్టకుండా ఉడికిస్తూ ఆఖరికి అదే ఆహారమైపోతుంది. దాంట్లో చేపను పెట్టేముందు ‘ఆ...ఆ....’ అంటూ సౌండ్స్ ఇస్తుంది. అది బాగా నచ్చింది.

కాల్ ఫిల్టర్ - ఓ జూజూ ప్రేమికుల జంట ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఈ లోపు ఇంకో జూజూ వచ్చి విసిగిస్తుంది. దాన్ని మన లవర్ జూజూ బోయ్ తిడతాడు. అపుడు మన హీరోయిన్ జూజూ నవ్వుతుంది. అంత అందమైన నవ్వు నేను వినడం మొదటిసారి.

ఎగ్జామ్ రిజల్ట్స్ - ముఖ్యంగా దీనిలో బోలేడు గుండు బొమ్మలను చూడొచ్చు. అందుకే ఇష్టం. పాపం ఒక జూజూ ఎగ్జామ్ తప్పుతుంది. అది పొగిలి పొగిలి ఏడుస్తుంది. ఇంకోటి పాసవుతుంది.

ఫేస్ బుక్ - Poke your friends and stay in touch అని ఓ రెండు జూజూలు పొట్టలో వేళ్ళతో పొడుచుకుంటూ అంటే కితకితల టైపన్నమాట నవ్వుకుంటూ ఉంటాయి. ఈ లోపు ఇంకోటి కూడా వచ్చింది వీళ్ళతో చేరుతుంది. కానీ ఇంకో చిలిపి, అల్లరి జూజూ మాత్రం ఒక జూజూ పొట్టలో కాకుండా కంటిలో పొడుస్తుంది. అవి కితకితలు పెట్టుకునేటపుడు బుడుక్ బుడుక్ మని సౌండ్ వస్తుంది. అది నచ్చింది.

గ్రూప్ SMS - ఒక జూజూ ఆడుకుంటూ ఉంటుంది. ఇంకో కోతి లాంటి జూజూ వచ్చి దాని పని చెడగొడుతూ... నెత్తిన ఒక్కటిస్తుంది (మనలో మన మాట ఇలాంటి పనులు చెడగొట్టే కోతి పనులు నాకు కూడా చాలా ఇష్టం gatai). ఈ లోపు ఆడుకొనే జూజూ కోపం నషాళానికి అంటి... విజిలేస్తే ఆంధ్ర సోడాబుడ్డి... ఓ నాలుగు జూజూలు వస్తాయి కట్ చేస్తే అక్కడ కోతి జూజూకు పగులుతుంది.

రీఛార్జ్ ఎనీవేర్ - వాహనంలో ఇంధనం ఐపోవడం వల్ల ఆగిపోతుంది. మన హీరోయిన్ జూజూకు కోపం వస్తుంది. గర్ల్ ప్రెండ్స్ తో బాధలు పాపం జూజూలకు కూడా తప్పలేదు... మొత్తానికి ఎలాగో మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. అపుడు మన లవర్ జూజూ బాయ్ సంతోషం చూడాలి.

రింగ్ టోన్స్ - ఎపుడు ఫోన్ సైలెంట్ లో ఉంచాలో చెబుతుంది. ఒక జూజూ మొసలికి ఆహారం పెట్టడానికి శబ్ధం చేయకుండా వస్తుంది. అది మొసలి దాటే స్టైల్... ఇంకా దాని నెత్తి మీద కాప్ అదుర్స్.

IPL contest - దీంట్లో అన్నీ జూజూలు సంతోషంగా గానాబజానాలు బాగుంటుంది. ఒకటి జూజూకు మాత్రం అర్ధం కానట్టుగా భుజాలు ఎగరేసే స్టైల్ సూపరు...

ఏదో రాస్తూ పోతే చాలా అయింది.... చివరాఖరిగా అన్నీ నచ్చేసాయ్. ఇక ఈ యాడ్స్ ను పెద్దలకు, పిల్లలకు ఇంత నచ్చినట్టుగా రూపొందించిన రాజీవ్ రావ్ అండ్ టీమ్ కు బోలెడు tepuktangantepuktangantepuktangantepuktangan మరి ఇదిగో డౌన్ లోడ్ లింక్ ...

http://www.vodafone.in/existingusers/pages/vodafonetvc.aspx

Monday, May 18, 2009

జనాలకు అస్సలు బుద్ది, సిగ్గు లేవంట!!!!


అమ్మో మీ మీద ఒట్టండి నేను అనలేదు ఈ మాట.. నిన్న పొద్దున్న పాల కోసం పాలబూతు కెళితే అక్కడ జనాలు అనుకుంటున్నారు (బహుశా!! ఈ జనాలకు సిగ్గు, బుద్ది ఉండి ఉంటాయి.)

అసలు సరుకులు ముఖ్యంగా బియ్యం ఒకేసారి ఆ లెక్కన అంత రేటు పెరిగిన కూడా జనాలు మళ్ళీ కాంగ్రేసునే గెలిపించారు. ఈ సారి రైతులు కాదు... మనలాంటి మధ్యతరగతోళ్ళు ఉరులు వేసుకోవాలి అని పాల‘బూతు’ దగ్గర తిట్టుకుంటున్నారు. అక్కడేమో సంవత్సరానికొకసారి జీతాలు పెంచుతారు. ఇక్కడ ఎప్పుడు పడితే అపుడు ఎలా పడితే అలా రేట్లు పెరుగుతున్నాయి. ఈ సారి జీతాలు పెంచడం కూడా డౌటే... ఎందుకంటే ఆర్ధికమాంద్యం అని అంటున్నారు. ప్రతిఒక్కడికి తీసుకొనేటపుడు ఏ మాంద్యం ఉండదు. ఇచ్చేటప్పటికి మాత్రం మాంద్యం గుర్తొస్తుంది. మాంద్యం ఏమో కానీ.... మా లాంటి మధ్యతరగతి జీవితాలు మందంగా, మోయ్యలేనంత బరువుగా తయారయ్యేట్టు ఉన్నాయి. sedih

ఇదివరకు మాలాంటి వాళ్ళు ఇళ్ళు కొనుక్కునేవాళ్ళు... మరి ఇపుడో...కళ్ళ ముందర పాల పుంతలు కనిపిస్తున్నాయి blur. ఇదివరకు సరుకులు, బియ్యం వచ్చిన డబ్బులతో ఇపుడు ఒట్టి బియ్యం మాత్రమే వస్తున్నాయి. మొన్నీమధ్య ఒడ్లు నిల్వలు చాలా ఉన్నాయి అని చదివినట్టు గుర్తు. అదే మా బియ్యం కొట్టువాడిని అడిగితే... అవి రూ.20 బియ్యం. ఉడికితే లావుగా ఉంటాయి. మనం తినలేమండి అని అన్నాడు.

ఎవరు గెలిచినా పర్లేదు కానీ... కాంగ్రేసు గెలవకూడదని అనుకున్నా.... ఏమ్ చేస్తాము? ఇంకో 5 ఏళ్ళ శని నడుస్తుంది జీవితాల్లో... మా ఆఫీసులో 98 శాతం కాంగ్రేసుకే వేసారు. నేను మాత్రం అసలు అభ్యర్ధి ఎవరో కూడా చూడకుండా... విజిల్ గుర్తుకు ఓటేసా... (జే.పి గారి కూలర్ ని లెండి నేను) ఆ మాట చెపితే నా అంత పిచ్చోళ్ళు లేరు అన్నట్టు ఓ లుక్కిచ్చి.... వాళ్ళు ఎలాగో గెలవరు అని వెక్కిరించారు. నా మనసు చివుక్కుమన్నా sedih నేను మంచి వైపు ఉన్నాను అనే తుత్తి... మా ఆఫీసులో కొంతమందికి కొన్ని పార్టీలవాళ్ళు చక్కగా ఇళ్ళకొచ్చి డబ్బులిచ్చారంట... మనకు 500 ఇచ్చి వాళ్ళు 5000 లాక్కుంటారని తెలుసు. అయినా ప్రత్యక్షంగా కాదుగా అది వాళ్ళ ధీమా... ఇంకా రాయాలని ఉన్నా.... నీరసంగా ఉందండి... (నచ్చనోళ్ళు గెలిచారుగా) ఉంటా..angkatkening

Sunday, May 10, 2009

అమ్మ (మా ఇంటి చీమ, బుడం‘కాయ’)

అదేంటి ఎక్కడైనా అమ్మలను దేవతలతో పోలుస్తారు కానీ... ఇలా చీమలతో, పాములతో పోలుస్తారా?? దీనికో ప్లాష్ బ్యాక్ ఉంది. మా అమ్మ, నేను తెల్లగా ఉంటాము. మా నాన్న, తమ్ముడు నల్లగా ఉంటారు. అందుకే మా నాన్న తమాషాగా ఒరేయ్ నేను, తమ్ముడు నల్లచీమలం. నువ్వు, మీ అమ్మ ఎర్రచీమలు అని తమాషాగా అనేవారు. నాన్న చనిపోయేవరకు ఏమీ తెలీదు... కానీ తర్వాత పడ్డబాధలు అన్నీ ఇన్నీ కావు. అమ్మకు అంతగా చదువురాదు.. ఏమీ తెలీదు. మాకు తెలీని వయసు. మొత్తానికి ఎలాగోలా బాధల నుండి ఓ 10 సంవత్సరాలకు విముక్తి దొరికినా... అమ్మ మాత్రం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయి.. మోకాళ్ళ నొప్పులు, హై బీపి వచ్చాయి. కానీ, ఇప్పటికి అన్నీ తలుచుకొని బాధపడుతుంది. బంధువులంతా దూరమయ్యారు. మనకు ఎవరూ లేరు అని దిగులుపడుతుంది. ఎవరు ఉంటారు మనకి దేవుడు ఉన్నాడు.. నేను, తమ్ముడు నిన్ను చూసుకుంటున్నాము ఇంక ఏం కావాలి అని ఓదార్చుతాము.

ఆ ఓదార్పులో ఇలా తనని ముద్దుగా చీమ, బుడంకాయ (కొంచెం పొట్టిగా ఉంటుంది) అని పిలుస్తాము.. చెప్పాలంటే తను అమ్మ కాదు... మా బిడ్డ అన్నట్టు ముద్దు ముద్దుగా పిలుస్తాము... అలా పిలిచేవాటిలో బుజ్జి, జుజ్జులు, కాయ (బుడంకాయను షార్ట్ కట్ చేసి.... అయినా కాయ అని కాకుండా పండు అనే పిలువాలని రూలుందా ఏంటి?) ఇలా ఇంకా ఏవేవో వస్తుంటాయి. అమ్మ అని పిలిచేది తక్కువ. తను కూడా ఇలా ఎలా పిలిచినా పలుకుతుంది.

చదువు రాకపోయినా... తనకు తెలిసిన విద్య మిషన్ కుట్టడం.... మోకాళ్ళ నొప్పులయినా మొన్నీ మధ్యదాకా బట్టలు కుట్టి ఆర్ధికంగా తనవంతు సహాయపడేది. నేనే ఈ మధ్య తిడితే మానేసింది. మోకాళ్ళ నొప్పులు రాకాపోతే ఇంక మా మాట వినేది కాదు. ఒక్కొసారి మా కాయ (అమ్మ) మమ్మల్ని చాలా విసిగిస్తుంది. ఊరికినే చిన్నవాటికి కోపం తెచ్చుకుంటుంది. పొద్దున్నే గోల మొదలుపెడుతుంది. అసలు మాకు ఆ టైమ్ లో ఎంత కోపం వస్తుందో తెలీదు. కానీ తనకున్నా శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల వల్ల అలా మారుతుంది. ఒక్కొసారి మేము పోట్లాడినా చాలా మటుకు తగ్గి కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉంటాము.

నాకు, మా కాయకు ఎక్కువగా గొడవలే జరుగుతాయి. ఎందుకంటే... మా తమ్ములుంగారికి అన్నీ టైమ్ కి చక్కగా అమర్చిపెడుతుంది. ఎంతైనా కొడుకు అందులో చిన్నోడు. నన్ను మాత్రం నా ముందు ఎప్పుడు తిట్టడమే. కానీ ఊరివాళ్ళ ముందు మాత్రం తెగ పొగుడుతుంది. ముఖ్యంగా నేను లేనపుడు మా తమ్ముడు దగ్గర..... నా పెద్ద బిడ్డే మీ నాన్న తర్వాత నాన్నలా కుటుంబ భాద్యత తీసుకుంది అని పొగుడుతుంది. ముఖ్యంగా మా వాడు ఏదైనా నిరాశ, నీరసంగా ఉంటే మాత్రం తప్పక క్లాస్ పీకుతుంది.

ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల తన బంగారం అమ్మేసాము. కానీ నా కోరిక మా కాయకు గాజులు, ఓ మాంచి గొలుసు చేయించాలి. కానీ తన కోరిక మంచాన పడకుండా ఎవరిచేత చాకిరీ చేయించుకోకుండా... నడుస్తూ, తిరుగుతూ పోవాలని. అచ్చు మా నాన్నలా.. ప్రస్తుతం బంగారం కొనకపోయినా... తనకు నచ్చిన చీరలు మాత్రం కొంటున్నాను. అపుడు మా కాయ మొహం మతాబులా వెలిగిపోతుంది. తనది చాలా చిన్నలోకం, చిన్న చిన్న కోరికలు. కానీ, తను ఊహించని విధంగా ఆశ్చర్యపరచి, సంతోషపరచాలి.

ఇలా పొగుడుకున్నా, పోట్లాడుకున్నా... మా కాయ నేను ఒక జట్టే. ప్రతిరోజూ మాకు మధర్స్ డేనే.. ఇలా బ్లాగులో నీ గురించి రాసా అని చెప్పినా కూడా ఆమెకు బ్లాగేంటో, ఇంటర్నెట్ ఏంటో ఏమీ అర్ధం కాదు. చెప్పాంటే చాలా ఉన్నా.... అవి మాటల్లో రాయలేనివి.... ఏదేమైనా మా కాయకు, జుజ్జులుకు బోలెడు.... ciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumcium pelukpelukpelukpelukpelukpelukpelukpeluk ఇంకా తనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను doadoadoa