Thursday, May 21, 2009

చైనీస్ వాస్తు - ఫెంగ్ షుయ్ - 4 (బాగ్ వా)

చైనీస్ వాస్తుకు ఆరంభం.... ‘బాగ్ వా’ అన్న అంశమే. ఇక ఏ దిక్కు, ఏ విధమైన అంశాలపై ప్రభావితం చూపుతుందో చూద్దాం.

ఉత్తరం : ఈ దిక్కు ఎలిమెంట్ వాటర్. అలానే రంగు బ్లూ, బ్లాక్, మీ గృహంలోని ఈ భాగం మీ కెరీర్ పైన, జీవిత గమనం పైన ప్రభావితం చూపిస్తుంది.

ఈశాన్యం : ఈ దిక్కు ఎలిమెంట్ ఎర్త్. అలానే రంగు లైట్ ఎల్లో, శాండ్ కలర్, ఈ విభాగం మీ యొక్క ఆధ్యాత్మిక చింతనపై ప్రభావం చూపుతుంది. అలానే మిమ్మల్ని మీరుగా తీర్చిదిద్దుకొనే విషయంపై తన ప్రభావాన్ని చూపుతుంది.

తూర్పు : ఈ విభాగానికి ఎలిమెంట్ ఉడ్. అలానే రంగులు బ్రౌన్, గ్రీన్. ఈ విభాగం మీ ఆరోగ్యం, మీ కుటుంబంపై తన ప్రభావాన్ని చూపిస్తుంది.

మిగిలిన దిక్కుల వివరాలు మరుసటి టపాలో...

(సేకరణ)

0 వ్యాఖ్యలు:

Post a Comment