అమ్మో మీ మీద ఒట్టండి నేను అనలేదు ఈ మాట.. నిన్న పొద్దున్న పాల కోసం పాలబూతు కెళితే అక్కడ జనాలు అనుకుంటున్నారు (బహుశా!! ఈ జనాలకు సిగ్గు, బుద్ది ఉండి ఉంటాయి.)
అసలు సరుకులు ముఖ్యంగా బియ్యం ఒకేసారి ఆ లెక్కన అంత రేటు పెరిగిన కూడా జనాలు మళ్ళీ కాంగ్రేసునే గెలిపించారు. ఈ సారి రైతులు కాదు... మనలాంటి మధ్యతరగతోళ్ళు ఉరులు వేసుకోవాలి అని పాల‘బూతు’ దగ్గర తిట్టుకుంటున్నారు. అక్కడేమో సంవత్సరానికొకసారి జీతాలు పెంచుతారు. ఇక్కడ ఎప్పుడు పడితే అపుడు ఎలా పడితే అలా రేట్లు పెరుగుతున్నాయి. ఈ సారి జీతాలు పెంచడం కూడా డౌటే... ఎందుకంటే ఆర్ధికమాంద్యం అని అంటున్నారు. ప్రతిఒక్కడికి తీసుకొనేటపుడు ఏ మాంద్యం ఉండదు. ఇచ్చేటప్పటికి మాత్రం మాంద్యం గుర్తొస్తుంది. మాంద్యం ఏమో కానీ.... మా లాంటి మధ్యతరగతి జీవితాలు మందంగా, మోయ్యలేనంత బరువుగా తయారయ్యేట్టు ఉన్నాయి.
ఇదివరకు మాలాంటి వాళ్ళు ఇళ్ళు కొనుక్కునేవాళ్ళు... మరి ఇపుడో...కళ్ళ ముందర పాల పుంతలు కనిపిస్తున్నాయి . ఇదివరకు సరుకులు, బియ్యం వచ్చిన డబ్బులతో ఇపుడు ఒట్టి బియ్యం మాత్రమే వస్తున్నాయి. మొన్నీమధ్య ఒడ్లు నిల్వలు చాలా ఉన్నాయి అని చదివినట్టు గుర్తు. అదే మా బియ్యం కొట్టువాడిని అడిగితే... అవి రూ.20 బియ్యం. ఉడికితే లావుగా ఉంటాయి. మనం తినలేమండి అని అన్నాడు.
ఎవరు గెలిచినా పర్లేదు కానీ... కాంగ్రేసు గెలవకూడదని అనుకున్నా.... ఏమ్ చేస్తాము? ఇంకో 5 ఏళ్ళ శని నడుస్తుంది జీవితాల్లో... మా ఆఫీసులో 98 శాతం కాంగ్రేసుకే వేసారు. నేను మాత్రం అసలు అభ్యర్ధి ఎవరో కూడా చూడకుండా... విజిల్ గుర్తుకు ఓటేసా... (జే.పి గారి కూలర్ ని లెండి నేను) ఆ మాట చెపితే నా అంత పిచ్చోళ్ళు లేరు అన్నట్టు ఓ లుక్కిచ్చి.... వాళ్ళు ఎలాగో గెలవరు అని వెక్కిరించారు. నా మనసు చివుక్కుమన్నా నేను మంచి వైపు ఉన్నాను అనే తుత్తి... మా ఆఫీసులో కొంతమందికి కొన్ని పార్టీలవాళ్ళు చక్కగా ఇళ్ళకొచ్చి డబ్బులిచ్చారంట... మనకు 500 ఇచ్చి వాళ్ళు 5000 లాక్కుంటారని తెలుసు. అయినా ప్రత్యక్షంగా కాదుగా అది వాళ్ళ ధీమా... ఇంకా రాయాలని ఉన్నా.... నీరసంగా ఉందండి... (నచ్చనోళ్ళు గెలిచారుగా) ఉంటా..

0 వ్యాఖ్యలు:
Post a Comment