Thursday, July 9, 2009

‘యాపిల్’కు ఆ పేరు వచ్చిందేలా?

ప్రపంచంలో కంప్యూటర్స్ సంస్థకు పెట్టడానికి ఎన్నో పేర్లుండగా ఈ ప్రఖ్యాత కంపెనీకి... యాపిల్ అని పేరు ఎందుకు పెట్టారంటే.... యాపిల్ కంప్యూటర్స్ అధినేత స్టీవ్ జాబ్స్ తన కంపెనీకో మంచి పేరు పెట్టాలని దాదాపు 3 నెలలు పలు పేర్లు పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆయన బుర్రకేం మంచి పేరు తట్టలేదు. ఓ రోజు స్టాఫ్ ను పిలిచి సాయంత్రం 5 గంటలలోపు మీరే ఓ మంచి పేరు సెలక్టు చేసి నాముందుంచాలని ఆజ్ఞ జారీ చేశాడు. అయితే... ఆ రోజు సాయంత్రం అయిదు గంటలు దాటినా స్టాఫ్ ఎవరూ ఎలాంటి పేరుతో అతడ్ని కలవలేదు. ఎవరూ ఎలాంటి పేరూ సూచించలేదు. షాకయిన స్టీవ్ అదే సమయంలో యాపిల్ తింటున్నాడు. వెనుకాముందు ఆలోచించకుండా తన కంపెనీకి తానే ‘యాపిల్ కంప్యూటర్స్’ అని నామకరణం చేసేశాడు.

2 వ్యాఖ్యలు:

Anonymous said...

WTF ??

Does the name NEWTON ring any bells ??

Sravya V said...

http://anilroyal.wordpress.com/?s=%E0%B0%86%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D >> ఈ లింక్ చూడంది ! అసలు కధ ఇది అనుకుంటా

Post a Comment