హుమ్!!! నిన్న మధ్యాహ్నం నుండి మొదలయ్యింది వినాయకుని నిమజ్జానాల సందడి. సాయంత్రం అలా బజారు కెళ్ళేచ్చే సరికి కూడా ఇంకా సందడి తగ్గలేదు. చాలా వరకూ చిన్నపిల్లలు పెట్టిన వినాయకుళ్ళే. మరోచోట బాగా పెద్దగా ఉన్న వినాయకుడు మంచి బ్యాండ్ మేళం, సినిమా పాటలతో స్వామివారి చేవులకు విందు కలిగిస్తూ.... సింగర్ ‘‘ఇపుడు చిలకపచ్చ కోక పెట్టినాది కేక’’ పాట పాడతాను అని ఎనౌన్స్ మెంట్ చేస్తున్నాడు.
అసలు వినాయకుడి నిమజ్జనం ఏంటి??? దానిలో ఈ చిలకపచ్చ కోకలు కేకలు పెట్టడం ఏంటో?? ఆ క్రిందటి సంవత్సరం అనుకుంటా!! బాగా గుర్తు... పొద్దున్నే కూరగాయలు కొనడానికి వెళితే... అంటే సుమారు 6 గంటలకన్న మాట... పాపం స్వామి వారి దగ్గర ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాట ప్లే చేసారు. బొలేడు భక్తిపాటలు ఉంటాయి. శ్లోకాలు ఉన్నాయి. అవి కాకుండా మరీ పొద్దున్నే ఇలాంటి పాటలతో స్వామిని ఈ విధంగా రంజింపచేయడం. ఇదేమైనా పెళ్ళి వేడుకనా??? ఇలాంటి పాటలు పాడటానికి!!! దేవుడు అంటే ఎంత భక్తిశ్రద్ధలతో, నిష్టగా చేయాలి. ప్రతిఒక్కళ్ళు చందాలు పొగేయ్యడం. ఒక్కో వీధికి సుమారు చిన్న, పెద్ద ఓ 10 వినాయక విగ్రహాలు పెట్టడం. ఇలాంటి సినిమా పాటలు పెట్టి ఆ భక్తి భావాన్ని ఇలా చెండాలం చెయ్యడం... దైవం ఉన్న ప్రదేశం అంటేనే ఓ రకమైన ప్రశాంతత, భక్తి భావం వచ్చే విధంగా ఉండాలి. పేరుకు వినాయకుడు... కానీ మనుషులే అక్కడ నాయకులు. వారికి నచ్చిన పాటలు, డ్యాన్సులు, గోల, పలహారాల రూపంలో ఉండే ప్రసాదాలు..
క్రిందటేడు... బాగా రద్దీగా ఉన్న బజారులో వినాయక నిమజ్జన సంబరాలు జరుగుతున్నాయి. ఆ గుంపులో ఉండే మగవాళ్ళు ఆ రద్దీలో వెళ్ళలేక ఇరుక్కొని ఎలాగో బయటపడదాం అనే ఆడవారిని కావాలని తాకుతూ డ్యాన్సులు వేస్తున్నారు. ఇంక ఎవరిని ఏమీ అడగలేని పరిస్థితి... వినాయక చూస్తున్నావా?? ఈ చేతలు... వింటున్నావా??? ఈ పాటలు...
సువర్ణకము
2 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment