ముఖ్యంగా ఇది బాగా ఎక్కువ టపాలు రాసేవాళ్ళను, ఎక్కువ కామెంటేవాళ్ళను చూస్తే వచ్చే ప్రశ్న ఇది. నాకైతే ఓ రెండు, మూడు టపాలు చదివితే తలనొప్పి, కళ్ళు లాగడం మొదలెడతాయి. తలనొప్పి అంటే టపాలో ఉండే విషయం వల్ల వచ్చేది కాదు. నా శారీరక బలహీనత. అందుకే ఏదైనా టపా చూస్తే క్రింద కామెంట్లను చూసి వాటిలో కేక, సూపర్, అదుర్సు వంటివి ఉంటే ప్రింటవుట్ తీసుకొని చదువుతా . మరీ ఎక్కువ కేకలు ఉన్న టపాలు ఇలా ప్రింటవుట్ తీసుకొని చదివితే మా బాస్ నన్ను కేకలేస్తారు..
కొంతమంది అయితే టపాలు ఏమీ రాస్తారో కానీ... ప్రతి బ్లాగు తెరిచిన వారి కామెంటు తప్పక ఉంటుంది. టైపు చేసి, టపా చదివి చేతులు, కళ్ళు నొప్పులు రావా?? ఏమీ డైట్ తీసుకుంటారో చెబుదురూ కాస్త!!! బ్లాగు రాయడానికి కాకపోయినా... ఆఫీస్ లో వర్క్ అయినా నొప్పులు లేకుండా చేసుకుంటా. లేదా వీరంతా బ్లాగడానికి ఎడిక్ట్ అయ్యారనుకోవచ్చా???
పోనీ ఇంత కష్టపడితే ఈ బ్లాగడం వల్ల డబ్బులు వస్తాయి కష్టపడచ్చు అనుకుంటే అదీ లేదు. ఇలా అనుకున్నా నేను మాత్రం బ్లాగు రాయడం ఆపి ఏడ్చానా ఏంటీ?? ఒకసారి బ్లాగు డిలీట్ చేసి మళ్ళీ మొదలుపెట్టా... ఎడిక్ట్ మాత్రం కాలేదులెండి... కానీ ఒకనొక సందర్భంలో అంతవరకూ వచ్చింది. ఇదివరకు పని ఉన్నా, లేకున్నా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా కూడలిని ఓపెన్ చెయ్యడం జరిగేది. ఈ మధ్య ఇది తగ్గింది. బ్లాగడం కూడా తగ్గింది. పూర్తిగా ఇటు వైపుకు రాకుండా ఎపుడు ఉంటానో??
3 వ్యాఖ్యలు:
త్వరలోనే!!! 8-}
డైట్ అంటే, రోజు పళ్ళు, కారట్లు ( పచ్చివి) తింటాను ! ఇవి కాక, నిమ్మకాయ కలిపిన మజ్జిగ ,మొలకెత్తిన గింజలు, మొక్కజొన్న ! బ్లాగ్స్,కామెంట్స్, రాయటానికి శక్తి కావాలి కదా ! ;-)
:)) :p
Post a Comment