కొత్తగా కంప్యూటర్ కొన్న ఒకాయన బిల్ గేట్స్ కు ఈ మధ్య ఒక ఉత్తరం రాశాడు. అదేమింటంటే.....
కంప్యూటర్ స్టార్ట్ బటన్ ఉంది కానీ స్టాప్ బటన్ లేదు. పెట్టడం మరిచిపోయుంటే సరిచేయమని కోరుతున్నాను.
రీసైకిల్ బిన్ పెట్టారు బాగానే ఉంది. దాని బదులు రీస్కూటర్ పెట్టలేరా? ఎందుకంటే నా దగ్గర స్కూటరే ఉంది.
ఫైండ్ బటన్ పెట్టినందుకు నేను ఎంతగానో సంతోషించాను. అయితే ఏ కారణం చేతో అది సక్రమంగా పనిచేయడం లేదు. మా ఆవిడ ఇంటితాళం పోగొట్టుకొని వెతికి పెట్టమని దాన్ని ఎన్నోసార్లు నొక్కిందట కానీ అది పనిచేయలేదు. మీరు ఎవర్నయినా పంపి రిపేరు చేయించండి.
మా అబ్బాయి మైక్రోసాఫ్ట్ వర్డ్ ను దాన్ని ఇంటికి తెచ్చిన రోజే నేర్చుకున్నాడు. ఇపుడు సెంటెన్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి?
నేను కంప్యూటర్ తో పాటు సిపియు, మౌస్, కీబోర్డు కూడా కొన్నాను. కానీ కంప్యూటర్ స్ర్కీన్ మీద ఒక్క ‘మై కంప్యూటర్’ చిహ్నం మాత్రమే కనిపిస్తోంది. మిగితావి ఎపుడు పెడతారు?
‘మై పిక్చర్స్’ అని ఒక ఫోల్డర్ ఉండి కానీ అందులో నా ఫోటో ఒక్కటీ లేదు.
మీరెప్పుడూ ఆఫీసులోనే ఉండడం వల్ల కాబోలు మైక్రోసాఫ్ట్ ఆఫీసు పెట్టేసి ఊరుకున్నారు. మైక్రోసాఫ్ట్ హోమ్ పెట్టకపోతే ఎలా? నా కంప్యూటర్ ఉండేది మా ఇంట్లోనే.
అన్నీ డాక్యుమెంట్లూ రీసెంట్ డాక్యుమెంట్లలోనే పెట్టాలంటే వెతుక్కోవడం కష్టంగా ఉంది. పాస్ట్ డాక్యుమెంట్లకు వేరే ఏర్పాటు చేయకపోతే ఎలా?
మై నెట్ వర్క్ ప్లేసేస్ ఇస్తే ఇచ్చారు మై సీక్రెట్ ప్లేసెస్ మాత్రం ఇవ్వకండి. మా ఆవిడకు తెలిస్తే గొడవైపోతుంది.
ఇదంతా కంప్యూటర్ గొడవ. మీ గురించిన ఒక వ్యక్తిగత సందేహం కూడా నన్ను ఎప్పట్నించో పీడిస్తోంది. మీ పేరు బిల్ గేట్స్ కదా మరి మీరెందుకు ఎప్పుడూ విండోసే అమ్ముతుంటారు. గేట్ లు అమ్మకూడదని ఏమైనా శాపం ఉందా?
సరదాగా ఉంది కదా!! 22-6-2008 ఆదివారం ఆంద్రజ్యోతి పుస్తకం నుంచి సేకరించాను.
సువర్ణకము
2 months ago
3 వ్యాఖ్యలు:
:D
=))
చాలా బావుంది
Post a Comment