మనమంతా అతి సులభంగా ప్రపంచ నలుమూలలకు సమాచారాన్ని పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించే “E-mail” సృష్టికర్త రే టామ్లిన్ సన్. ఆయన ఆవిష్కరణ మొత్తం కమ్యునికేషన్ రూపురేఖలనే మార్చివేసింది.
ఒక సాధారణ కంప్యూటర్ ఇంజినీర్ గానే మిగిలిపోయిన రే టామ్లిన్ సన్ ఐటి రంగంలో మరుగున పడిన మాణిక్యాల్లో ఒకరు. ఆయన ఆవిష్కరణకు పేటెంట్ ఉంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడై ఉండేవాడు. దాదాపు 31 ఏళ్ళ క్రితం కేంబ్రిడ్జిలోని బోల్ట్ బెరనిక్ అండ్ న్యూమెన్ (బీబీఎన్) అనే కంపెనీలో రే టామ్లిన్ సన్ పనిచేస్తూ ఉండేవారు. అమెరికా రక్షణ శాఖ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలను కలుపుతూ (ముఖ్యంగా సైనిక స్థావరాలను) ARPANET (ఇంటర్నెట్ ను పూర్వం ARPANET అని పిలిచేవారు) అనే నెట్ వర్క్ ను రూపొందించే ప్రాజెక్టులను BBNకి అప్పగించింది.
BBNలో పనిచేసే శాస్ర్తవేత్తలు ఒకరినొకరు సమాచారాన్ని పంపుకోవటానికి SNDMSG అనే ఎలక్ర్టానిక్ Message programmeను రూపొందించారు. అయితే దీన్ని ఒక మిషన్లో మాత్రమే వాడుకోగలం. అంటే ప్రతి మిషన్లో కొన్ని mail boxes ఉంటాయి. వీటి ద్వారా ఒక దాని నుంచి మరొక దానికి సమాచారాన్ని పంపగలం.
ఒకరోజు టామ్లిన్ సన్ ARPANETలో అనుసంధానమైన వివిధ ప్రాంతాలకు ఫైల్స్ పంపటానికి కొత్త technologyని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ టెక్నాలజీ ఆధారంగా పంపే mails ARPANETలో అనుసంధానమైన వారందరికి వెళ్తాయి. ఈ విధంగా కాకుండా వ్యక్తిగతంగా mails పంపటానికి వీలుగా technology రూపొందిస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. వ్యక్తులను, వారి address వేరు చేయడానికి ఏదో ఒక గుర్తు కావాలి.
చాలా ఆలోచించిన మీదట technology రంగంలో ఉపయోగించని గుర్తులు వెతికితే @ దొరికింది. దాన్ని ఉపయోగించారు టామ్లిన్ సన్. ఆ తర్వాత SNDMSGలో కొన్ని మార్పులు చేసి టామ్లిన్ సన్ పక్కపక్కనే ఉన్న machinesకు ఒకదాని నుంచి మరొకదానికి message పంపాడు. అదే చరిత్రలో first e-mail.
టామ్లిన్ సన్ పంపిన తొలి mail message QWERTYUIOP. ఇవన్నీ keyboard మూడో వరసలో ఉన్న అక్షరాలుతో టామ్లిన్ సన్ తన computer నుంచి ప్రక్క computerకు ఈ మెసెజ్ పంపారు. కొత్త ఆవిష్కరణ శాస్ర్తవేత్తలను ఆకర్షించింది. రెండేళ్ళలోపులోనే ARPANET నుంచి పంపే మొత్తం సమాచారంలో 75convertCP2Char error: Code point out of range: NANconvertCP2Char error: Code point out of range: NANail ద్వారానే పంపేవారు. 1972లో Americaకు చెందిన Advanced Research Projectకు చెందిన లారెన్స్ రాబర్ట్స్ అనే కంప్యూటర్ ఇంజనీరు mails అన్నింటిని (వచ్చేవి, పోయేవి) ఒక క్రమపద్ధతిలో పెట్టే విధానాన్ని రూపొందించారు. ఆ తర్వాత e-mailsను పంపే technologyని వాణిజ్యపరంగా అనేక కంపెనీలు ఉపయోగించుకొవడం వీలయ్యేది.
ఆ తర్వాత photos, videos, audioe filesను కూడా పంపేందుకు వీలుగా కొత్త technologyలను రూపొందించారు. 1980ల వరకూ ARPANET projectను BBN నిర్వహించింది. ఆ తర్వాత కూడా టామ్లిన్ సన్ BBNలోనే ప్రిన్సిపల్ ఇంజనీరుగా కొనసాగారు. 60 ఏళ్లు దాటిన వయస్సులో కూడా రోజుకు 90mails వరకూ చదివి, వాటికి సమాధానాలు ఇచ్చేవారంట. - వాణిజ్యపరంగా e-mailsను తొలిసారి అందించింది Compuserve Company. 1989లో ఈ కంపెనీకి 5లక్షలమంది వినియోగదారులు ఉండేవారు. - America Postal Service 1992లో ప్రత్యేక ‘E-mail’ serviceను ప్రారంభించింది. దీన్ని 1995లో నిలిపివేశారు. - ప్రపంచంలో e-mailను పంపిన తొలి దేశాధినేత Britain Queen Elisabeth. - ఎన్నికల ప్రచారానికి chain e-mailsను తొలిసారి ఉపయోగించింది జిమ్మీ కార్టర్
సువర్ణకము
2 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment