పాపం బ్లాగ్లోకంలో అంతా సుమన్ గారికి విరోధులే... నేను తప్ప ... సుమన్, ప్రభాకరు మంచి దోస్త్ లనీ... ఈ-టి.వి కి ఇన్ని రాజకీయాలున్నాయని బ్లాగ్ టపాల ద్వారానే తెలిసింది. కాకపోతే ఓ డౌట్ మాత్రం వచ్చేది... ఎపుడంటే... E-TV అవార్డుల పంక్షన్ కు అన్ని అవార్డులు సుమన్, ప్రభాకర్ లకు మాత్రమే వచ్చేవేంటబ్బా.... అని...కానీ బ్లాగ్ ల ద్వారా నా సందేహాం తీరిందనుకోండి.
గత సంవత్సరం పంక్షన్ కి అనుకుంటా... సుమ యాంకరింగ్ చేస్తుంది. ప్రభాకర్ కు ముందే తెలుసేమో E-TV బెస్ట్ యాంకర్ అవార్డు తనకే ఇస్తారని... సుమ ఫీల్ అవుతుందేమోనని కాసేపు సోపు వేసాడు
ఇంతకీ సుమన్ సీరియల్స్ గురించి చెప్పొచ్చేదేంటంటే...
నేను పెద్ద ఫ్యాన్ ని... (స్విచ్ వెయ్యగానే తిరిగే ఫ్యాన్ ని కాదు... విసురుకుంటే తప్ప తిరగని తాటాకు ఫ్యాన్ ని)
ఎందుకంటరా... ఆ సీరియల్స్ లోని సెంటి‘మెంటల్’ డ్రామాలు చూసి మాకు తెగ నవ్వు వచ్చేది. ఆ మధ్య... మధ్యలో ఆగిపోయిన సీరియల్ ‘జీవితం’ గురించి... దాంట్లో ఓ తల్లి పాత్ర... తండ్రి ఎవరో చెప్పకుండా పిల్లలను పెంచుతుంది. కూతురు మా తండ్రి ఎవరూ అని అడగడం ఆలస్యం పొగిలి పొగిలి ఏడుస్తూ కుండల కుండల కన్నీళ్ళు మేకప్ చెరగకుండా కార్చేసేది. ఇంక చుట్టు పక్కల వాళ్ళు ఏదైనా ఎగతాళిగా మాట్లాడితే.... రయ్యిమంటూ దూసుకెళ్ళి కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని...
ఇక దాంట్లో కామెడి....
కామెడి అంటే మరీ ఇంత కామెడీగా చెయ్యోచ్చ అన్నట్లు ఉండేది. పాపం నటించేవాళ్ళు 10 ఎకరాల కామెడి పండిద్దాం అన్నట్లు చేసే కామెడికి ఫుల్ నవ్వు... మాకు. ఇంక ప్రభాకర్ అ‘మాయ’కుడుగా నటించాడు... చూసే మొహాలు పెద్ద పిచ్చి మొహాలు... ప్చ్!!! డైలాగ్ చెప్పడం మొదలుపెట్టారంటే... ఎప్పటికి ఆపుతారా అంటే... ఎప్పటికో ఆపేవాళ్ళు... పాపం అచ్యుత్.....సుమన్ ఏడుపు సీరియల్స్ లో నటించే గుండె నొప్పి వచ్చేందేమో అని నా డౌట్.
ఈ ఏడుపు గొట్టు డ్రామాలు చూసి మనసు చలించకపోగా... ఆ అచ్చమైన, స్వచ్చమైన డైలాగులకు... ఆ ప్రాస పాటలకు... కామెడి లేని కామెడికి ఫుల్ నవ్వు వచ్చేది. ఇపుడు ఆ నవ్వులన్నీ అటకెక్కాయి. అటక మీద మిఠాయి పొట్లం తియ్యాలంటే సుమన్ రావాల్సిందే
ఏంటో వాళ్ళిద్దరి ప్రోగ్రామ్స్ అన్ని నాసిగా, ముతకగా అన్నట్లు ఉండేది. ఇపుడు E-TVకి మాంచి రిచ్ లుక్ వచ్చిందనిపిస్తుంది.
సుమన్ గారు E-TV వద్దులెండి... మీరు వేరే ఛానల్ మొదలుపెట్టండి. మీ ఛానల్ కి రేటింగ్స్, యాడ్స్ లేకపోయినా మాలాంటి తాటాకు ఫ్యాన్స్ ఎపుడూ మీ వెంటే ఉంటారు...

వెన్నపాల
కన్నెలోల
పాపాలన్నీ నా పాల
ఈ శాపాలన్నీ నా కేల
కోకొ కోలా
హు!!! మరీ ఇంత ప్రాస చూసుకొని అన్ని కష్టాల్లో కూడా మేకప్ చెదరకుండా పాట పాడటమంటే తమాషా అనుకుంటున్నారా???కన్నెలోల
పాపాలన్నీ నా పాల
ఈ శాపాలన్నీ నా కేల
కోకొ కోలా
ఇక దాంట్లో కామెడి....
కామెడి అంటే మరీ ఇంత కామెడీగా చెయ్యోచ్చ అన్నట్లు ఉండేది. పాపం నటించేవాళ్ళు 10 ఎకరాల కామెడి పండిద్దాం అన్నట్లు చేసే కామెడికి ఫుల్ నవ్వు... మాకు. ఇంక ప్రభాకర్ అ‘మాయ’కుడుగా నటించాడు... చూసే మొహాలు పెద్ద పిచ్చి మొహాలు... ప్చ్!!! డైలాగ్ చెప్పడం మొదలుపెట్టారంటే... ఎప్పటికి ఆపుతారా అంటే... ఎప్పటికో ఆపేవాళ్ళు... పాపం అచ్యుత్.....సుమన్ ఏడుపు సీరియల్స్ లో నటించే గుండె నొప్పి వచ్చేందేమో అని నా డౌట్.
ఈ ఏడుపు గొట్టు డ్రామాలు చూసి మనసు చలించకపోగా... ఆ అచ్చమైన, స్వచ్చమైన డైలాగులకు... ఆ ప్రాస పాటలకు... కామెడి లేని కామెడికి ఫుల్ నవ్వు వచ్చేది. ఇపుడు ఆ నవ్వులన్నీ అటకెక్కాయి. అటక మీద మిఠాయి పొట్లం తియ్యాలంటే సుమన్ రావాల్సిందే
ఏంటో వాళ్ళిద్దరి ప్రోగ్రామ్స్ అన్ని నాసిగా, ముతకగా అన్నట్లు ఉండేది. ఇపుడు E-TVకి మాంచి రిచ్ లుక్ వచ్చిందనిపిస్తుంది.
సుమన్ గారు E-TV వద్దులెండి... మీరు వేరే ఛానల్ మొదలుపెట్టండి. మీ ఛానల్ కి రేటింగ్స్, యాడ్స్ లేకపోయినా మాలాంటి తాటాకు ఫ్యాన్స్ ఎపుడూ మీ వెంటే ఉంటారు...
11 comments:
సుమన్ గారు(?), పిలుపు ఎందుకో కొత్తగా అనిపినించింది....
ఆయన సీరియల్లు లేకపోవడం వల్ల కొన్ని హస్య టపాలు లేకుండా పోయాయి.. అందుకోసం నాకు భాదగానే ఉంది...
నేను కూడా ఈ-టివి కి పెద్ద ఫ్యాన్ ని .
బాలకృష్ణ సినిమా సంవత్సరానికి ఒకటే వస్తుంది, కానీ సుమన్ సీరియల్స్ -- రోజూ వస్తాయి కదా!
సుమన్ లేకపోయేసరికి ఈ-టివి చూడడమే మానేశా.
ఆ పాట ఇదీ! ఆ మధ్య దీని మీద సుమన్ సాహిత్య ఝరి మీద ఒక టపా రాద్దామని పాట కాపీ చేసి ఉంచాను. ఇంతలో సుమన్ "విధి" వక్రించి "జీవితం" "పద్మవ్యూహం" లో చిక్కుకుంది. చూశారా సుమన్ పేరెత్తితే నాక్కూడా కవిత్వం వచ్చేస్తోంది.
చిన్ని గోపాలా
ఇన్ని కోపాలా
పూజలో లోపాలా
పూర్వ జన్మ పాపాలా
విన్నపాలన్ని మన్నుపాలేనా ఓ వెన్నబాలా కన్నె బాలా ...! హమ్మో ఇక నా వల్ల కాదు.
అది సరే, జీవితం మీద విసిగిపోయినావిడ విషాద గీతం పాడుకోకుండా అదేదో కృష్ణుడు పనీ పాటా లేకుండా ఆమె మీద అలిగినట్టు, అలక తీర్చాడానికి ఈ పాట పాడినట్టూ...ఏమిటో ఈ గోల!
ఈ టపా సుమన్ కి పంపించే ఏర్పాటు చేసారంటే మర్యాదగా ఉండదు మరి. ఏదో మనశ్శాంతిగా ఇలా బతకనివ్వండి.
నేను సుమన్ గారి కృష్ణుడి వేషం చూసి (ఎన్.టి .ఆర్ ని మర్చిపోయా )ఫాన్ని ఐపోయా .ఇక ప్రభాకరన్నయ్య ....పాపం జీ తెలుగు గతి ఏం కానుందో ?అన్నట్టు మీ టపా మధ్యన స్మైలీస్ చాలా బావున్నాయండీ .
ఇపుడు ఆ నవ్వులన్నీ అటకెక్కాయి. అటక మీద మిఠాయి పొట్లం తియ్యాలంటే సుమన్ రావాల్సిందే ...,,,కూడా ప్రభాకర్ ఉంటేనే మజా. నిజం ఇప్పుడు etv కామెడీలు లేక వేళ వేళ పోతోంది. ఆ చిన్ని కృష్ణుడు, వెంకన్న స్వామి మనందరి మొర ఎప్పుడు ఆలకిస్తారో. ఎందుకంటే వారిద్దరమీదే కదా సుమన్ అంకుల్ అన్ని వేషాలు వేసి పాటలు పాడింది. నిజంగా వీరిద్దరికీ ఏ మాత్రం దయ దాక్షిణ్యం, కృతజ్ఞత లేవు సుమనుంకుల్ మీద. చక్కగా పోగిడించుకున్న కాలం పోగిడించుకొని ఇప్పుడు కాం అయిపోయారు. కలి కాలం మరి.
ప్రఫుల్ల చంద్ర గారు
ఎపుడైనా సుమన్ నా బ్లాగు చూస్తే ;-) బాగోదుగా...‘అతి’ సీరియల్స్ కు ‘అతి’ మర్యాద అందుకే ‘గారు’లు వండి వడ్డించాల్సోచ్చింది :-(
మనోహర్ గారు
ఈ-టి.విలో సుమన్ గారు వద్దులెండి :-( వేరే ఛానల్ ఏదైనా పెడితే రోజూ సీరియల్స్ చూడచ్చు.
సుజాత గారు
"విధి" వక్రించి "జీవితం" "పద్మవ్యూహం" అని భలే రాసారండి.. పాట బాగా గుర్తుపెట్టుకున్నారండి....
నా అంతట నేను ఈ టపాను పంపించను... సుమన్ గారు తనంతట తానుగా ఈ టపాను చూస్తే నా పూచి కాదు ;-)
పరిమళం గారు
మీరు కూడా స్మైలీలు టపా మధ్యలో పెట్టాలంటే http://ayushmanbhava.blogspot.com/2009/01/yahoo-emotions.html
ఈ లింకు చూడండి.
కృష్ణారావు గారు
సుమన్ గారు మీకు బంధువులావుతారా? అంకుల్ అంటున్నారు... దయచేసి ఈ టపా సంగతి చెప్పకండి. Plz :-(
అయినా పాపం ప్రాస పొగడ్తలకు ఆ చిన్ని కృష్ణుడు, వెంకన్న స్వామిలకు కూడా విరక్తి వచ్చి ఇలా జరిగిందేమో !!!!
కృష్ణా రావు గారు,
పాపం ఆ వెన్న దొంగకు, వెంకన్నకు (సుమన్ వేసిన వారి వేషాలు...అదే అవతారాలు చూసి)విరక్తి పుట్టే సుమన్ విధి వక్రించిందేమో!
వాణి గారు,
ఇంతకు ముందు బ్లాగుల్లోనే ఎవరో ఇలా ప్రాస రాశారండి. అది గుర్తొచ్చి రాశాను. నా సొంతం కాదు.
మా సుమన్ గారిని వెక్కిరించేస్తున్నారు.. ఇదేమైనా న్యాయంగా ఉందా.. "లా" తో లాగి లాగి అంత్య ప్రాసను తన కావ్య ఝరితో రంగరించి మా అమ్మమ్మ కన్నీటిలో కలిపి ప్రవహింపజేసిన గొప్ప వ్యక్తి ఆయన.. నా చిట్టి చెల్లి తన ఆరేళ్ళ వయసులో "పద్మవ్యూహం" లో చిక్కుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.. ఎందుకు ఏడ్చిందో కూడా తెలియనంత గొప్ప వ్యూహాన్ని అందించిన సుమన్ గారి గురించా మీరు ఇలా మాట్లాడుతున్నారు..
హత "విధీ"...
సుమనంకుల్ - ఓంకార్ బాబాయ్. వీరందర్కీ చుట్టాలే. సుమనంకుల్... TV రంగంలో ఒక క్రొత్త వొరవడిని సృష్టించాడు. ఏమిటంటే... ETV AWARDS. తను పౌరాణిక వేషాలు వేసాడు కాబట్టి తన కోసం ప్రత్యేకంగా 'ఉత్తమ పౌరాణిక నటుడు' (కేవలం తనకోసం) అనే అవార్డు ని ప్రవేశ పెట్టి తనకి తనే ఇచ్చేసుకున్నాడు. (బ్లాగ్లర్లలో కొంతమంది .. నేను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని, నాకు చాలా విద్యలోచ్చు, నేను ఒక సంచలన రచయితను, నేను ఒక చరిత్రను సృష్టించాను, అని తమ తమ PROFILES లోను, టపాల లోను రాసుకుంటారు (డబ్బా కొట్టుకోవడం) చూడండి.. అలాగన్న మాట). మన అదృష్టమో, దురదృష్టమో కాని ... ముందు ముందు ఆయన వేయబోయే వేషాలు .. అంటే.. పిట్టల దొర, అత్తరు సాయబు, బుడబుక్కల వాడు, జంగం దేవర, సర్కస్ బఫూన్, హరిదాసు, గంగిరేద్దోడు.. ఇటువంటి వేషాలన్నీ మిస్సయ్యాము.. ఎం చేస్తాం మన ఖర్మ. ఎవరికి యెంత ప్రాప్తమో అంతే ప్రాప్తం. ఓ పని చేస్తే బావుంటుందేమో అందరూ ఆలోచించండి. ఏమిటంటే మనమంతా ... సుమన్ ఫన్సుమి అన్నమాట.. మహా సుమనా ప్రభ యాగం చేస్తే... వారు మరల మనందర్నీ ఆలరిస్తారేమో.
భలేగా చెప్పారండీ. బాగుంది మీ టపా..!
ఈ మధ్యనే పాపం జనాలు కాస్త ఈటీవీ చూస్తున్నట్టు చెప్తున్నారు.
సుమన్ గారు మళ్ళీ రావడం కంటే వేరే చానల్ పెట్టడమే బెటరేమో.. ఆయన ఫాన్స్ ఫాలో అవ్వడం కోసం :))
కృష్ణా రావు గారు,
పదండి, యాగం ఏర్పాట్లు చూద్దాం! ఎన్ని రోజులని ఇలా కామెడీ లేకుండా నిస్సారంగా గడపాలి రోజులు?