
కానీ, నాకు తెలివితేటలు ఎక్కువ

ఏ యాడ్ ని తీసిపారేసేంత సాహసం నాకు లేకపోయినా.... కానీ, వాటిలో నాకు నచ్చిన కొన్ని....


వాయిస్ SMS - ఓ డబ్బా తీసుకొని గడగడా నాలుగు మాటలు చెప్పి ఇంకొ జూజూ నెత్తిన వేస్తుంది. దాంట్లో నచ్చింది... జూజూ గడగడ మాట్లాడి పకపక నవ్వడం... ఇంకో జూజూ నెత్తిన డబ్బా పడినపుడు ఉలిక్కిపడటం....
భక్తి సాగర్ - రెండు జూజూలు కొమ్మను పట్టుకొని వేలాడుతుంటాయి. పాపం వదిలితే కిందపడిపోతాయి. ఒకటి మాత్రం అరిచి గోల చేసి ఆఖరికి దణ్ణం పెట్టకొని కింద పడిపోతుంది. ఇంకోటి మాత్రం సెల్ ఆన్ చేసి భక్తిపాటలు వింటూ కొమ్మ వంక సెల్ వంక ఓ రకమైన అమాయకపు మొహం పెట్టుకొని చూస్తుంది.
బిజీ మెసేజ్ - ఓ జూజూ మొసలికి చేపను పెట్టకుండా ఉడికిస్తూ ఆఖరికి అదే ఆహారమైపోతుంది. దాంట్లో చేపను పెట్టేముందు ‘ఆ...ఆ....’ అంటూ సౌండ్స్ ఇస్తుంది. అది బాగా నచ్చింది.
కాల్ ఫిల్టర్ - ఓ జూజూ ప్రేమికుల జంట ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఈ లోపు ఇంకో జూజూ వచ్చి విసిగిస్తుంది. దాన్ని మన లవర్ జూజూ బోయ్ తిడతాడు. అపుడు మన హీరోయిన్ జూజూ నవ్వుతుంది. అంత అందమైన నవ్వు నేను వినడం మొదటిసారి.
ఎగ్జామ్ రిజల్ట్స్ - ముఖ్యంగా దీనిలో బోలేడు గుండు బొమ్మలను చూడొచ్చు. అందుకే ఇష్టం. పాపం ఒక జూజూ ఎగ్జామ్ తప్పుతుంది. అది పొగిలి పొగిలి ఏడుస్తుంది. ఇంకోటి పాసవుతుంది.
ఫేస్ బుక్ - Poke your friends and stay in touch అని ఓ రెండు జూజూలు పొట్టలో వేళ్ళతో పొడుచుకుంటూ అంటే కితకితల టైపన్నమాట నవ్వుకుంటూ ఉంటాయి. ఈ లోపు ఇంకోటి కూడా వచ్చింది వీళ్ళతో చేరుతుంది. కానీ ఇంకో చిలిపి, అల్లరి జూజూ మాత్రం ఒక జూజూ పొట్టలో కాకుండా కంటిలో పొడుస్తుంది. అవి కితకితలు పెట్టుకునేటపుడు బుడుక్ బుడుక్ మని సౌండ్ వస్తుంది. అది నచ్చింది.
గ్రూప్ SMS - ఒక జూజూ ఆడుకుంటూ ఉంటుంది. ఇంకో కోతి లాంటి జూజూ వచ్చి దాని పని చెడగొడుతూ... నెత్తిన ఒక్కటిస్తుంది (మనలో మన మాట ఇలాంటి పనులు చెడగొట్టే కోతి పనులు నాకు కూడా చాలా ఇష్టం

రీఛార్జ్ ఎనీవేర్ - వాహనంలో ఇంధనం ఐపోవడం వల్ల ఆగిపోతుంది. మన హీరోయిన్ జూజూకు కోపం వస్తుంది. గర్ల్ ప్రెండ్స్ తో బాధలు పాపం జూజూలకు కూడా తప్పలేదు... మొత్తానికి ఎలాగో మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. అపుడు మన లవర్ జూజూ బాయ్ సంతోషం చూడాలి.
రింగ్ టోన్స్ - ఎపుడు ఫోన్ సైలెంట్ లో ఉంచాలో చెబుతుంది. ఒక జూజూ మొసలికి ఆహారం పెట్టడానికి శబ్ధం చేయకుండా వస్తుంది. అది మొసలి దాటే స్టైల్... ఇంకా దాని నెత్తి మీద కాప్ అదుర్స్.
IPL contest - దీంట్లో అన్నీ జూజూలు సంతోషంగా గానాబజానాలు బాగుంటుంది. ఒకటి జూజూకు మాత్రం అర్ధం కానట్టుగా భుజాలు ఎగరేసే స్టైల్ సూపరు...
ఏదో రాస్తూ పోతే చాలా అయింది.... చివరాఖరిగా అన్నీ నచ్చేసాయ్. ఇక ఈ యాడ్స్ ను పెద్దలకు, పిల్లలకు ఇంత నచ్చినట్టుగా రూపొందించిన రాజీవ్ రావ్ అండ్ టీమ్ కు బోలెడు




1 వ్యాఖ్యలు:
:))
Post a Comment