Thursday, May 7, 2009

డ్రాగన్ టెల్స్ - నాకు నచ్చిన కార్టూన్

మాములుగా ఏ ఛానల్ చూస్తున్న టామ్ అండ్ జర్రీ కోసం ఓ లుక్కు, రిమోట్ నొక్కు కార్టూన్ ఛానల్ పై ఉంచుతాను. ఎందుకంటే అవి చూస్తుంటే మనం చిన్నపిల్లలమైపోయినట్టుంటుంది. అలా ఓ రోజు నాకు పరిచయమైనది ఈ డ్రాగన్ టెల్స్.


అసలు కథ ఏంటంటే...

అనగనగా ఓ డ్రాగన్ లాండ్ అక్కడన్నీ ఎక్కువగా డ్రాగన్స్ ఉంటాయి.. ఇంకా రకరకాల విచిత్రాకృతి గల జంతువులు, మొక్కలు ఉంటాయి. ఒకానొకసారి... ఓ డ్రాగన్ కు మానవులైన చిన్నపిల్లలతో ఆడుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఆ డ్రాగన్ తన ఒంటి పై వున్న కొన్ని స్కేల్స్ తీసుకొని వాటి పై ఇలా మనసారా మనసారా మేమ్ కోరుకుంటాం, డ్రాగన్లతో పాటు వెళ్ళి ఆడుకుంటాంఅనే మంత్రాన్ని రాసి వాటిని విసిరేస్తుంది. అవి దొరికిన పిల్లలు ఆ మంత్రం ద్వారా డ్రాగన్ లాండ్ కు వచ్చి డ్రాగన్లతో ఆడుకొనేవారు.


* * * * * * * * * *


ఎమ్మీ, మాక్స్ అనే ఇద్దరు అక్కతమ్ముళ్ళు వాళ్ళ కుటుంబం ఓ ఇంటిలోకి కొత్తగా వస్తారు. అక్కడ వీళ్ళిద్దరికి ఇచ్చిన గదిలో వీళ్ళకి ఓ స్కేల్ దొరుకుతుంది. మంత్రం జపించి డ్రాగన్ లాండ్ కు వెళతారు. మొదట వాళ్ళకు ఎక్కడకొచ్చారో ఏమి తెలీదు. అక్కడ మాక్స్ కు ఒక పెద్ద రాయి లాంటిది దొరుకుతుంది. అది ఆడ్ అనే డ్రాగన్ ది.


* * * * * * * * * *


ఇక్కడ ముఖ్య డ్రాగన్ పాత్రలు ఆడ్చాలా బలవంతుడు, కానీ పిరికివాడు. క్యాసిఅందంగా ఉండే అల్లరి ఆడ డ్రాగన్ పిల్ల, ఇంక జాక్ అండ్ వీజి, వీరు రెండు తలల డ్రాగన్స్ కానీ శరీరం ఒకటే. జాక్ ఎంత నిదానస్తుడో, వీజి అంత అల్లరి పిడుగు. లొడ లొడ వాగుతూ గడబిడ చేస్తుంది.


* * * * * * * * * *


ఇక ఎమ్మీ, మాక్స్ ల దగ్గరకొద్దాం...

ఆడ్ పోగొట్టుకున్న పన్ను కోసం విచారంగా వెతుక్కుంటు ఎమ్మీ, మాక్స్ లున్న చోటికి క్యాసి తో పాటు వస్తాడు.. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు.. అలాగే జాక్, వీజిలు కూడా పరిచయం అవుతారు. డ్రాగన్లు ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్తాయి. కానీ, ఎమ్మీ, మాక్స్ లు ఎగరలేరు కాబట్టి క్యాసి వీపుపై ఎమ్మీ, ఆడ్ వీపుపై మాక్స్ కూర్చుంటారు. డ్రాగన్లు ఆకాశంలో ఉన్న స్కూల్ లో చదువుకుంటారు. మబ్బుల మధ్య ఊయలలు, జారుడుబల్లలాట ఆడుకుంటారు.


* * * * * * * * * *


ఈ కధలలో చిన్న చిన్న నీతి కధలు, మంచి పాటలు చిన్న పిల్లలకు మంచి ప్రవర్తన నేర్చుకునేందుకు బాగుంటాయి.

ఉదా...కు మనం మన ఇష్టాలతోపాటు ఇతరుల ఇష్టాలకు విలువ, గౌరవం ఇవ్వడం, కోపాన్ని తగ్గించుకోవడం, ప్రతి ఒక్కరిలో ఏదో ప్రతిభ ఉంటుంది. కానీ మనలో ఏ ప్రతిభ ఉన్నది ఎలా తెలుసుకోవడం. లావుగానో, పొట్టిగానో, ఇలా మన ఆకారాన్ని చూసి బాధపడటం తప్పు అది ఏదో ఒక సమయంలో మనకు మనవారికి ఉపయోగపడుతుంది వంటి రక, రకాల నీతి కధలు పిల్లలకు కార్టూన్ చూడటంతో పాటు, ఇవి నేర్చుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.

0 వ్యాఖ్యలు:

Post a Comment