ప్రధమంగా ఫెంగ్ షుయ్ అనబడే చైనీస్ వాస్తులో మనం గ్రహించవలసిన విషయం ఇంట్లో పనికిరాని చెత్తాచెదారాన్ని ఎంతో కాలంగా ఉపయోగించని వస్తువుల్ని క్లియర్ చేయటం దీన్నే క్లియరింగ్ ఆఫ్ క్లట్టర్ అంటారు.
ఉదాహరణకు ఉత్తర భాగంలో చెత్త అధికంగా ఉంటే అది మీ కెరీర్, మీ లైఫ్ ల పై దుష్ర్పభావం చూపుతుంది. అలానే ఆగ్నేయంలో చెత్త అధికంగా ఉంటే మీ ఐశ్వర్యం, ఆదాయం, సంపదపై ప్రభావం చూపుతుంది.
ముందుగా మీరు క్లియర్ చేయాల్సిన ఏరియాలు... బెడ్ రూమ్, కిచెన్, ఎంట్రన్స్ భాగం.
చాలామందికి పనికిరాని చెత్తాచెదారాన్ని బెడ్ క్రిందకు తోయటం ఓ అలవాటు. ముందు దీన్ని తొలగించాలి.
అలానే బెడ్రూమ్ లో అటకలు, అల్ మైరాల్లో చాలాకాలంగా ఉపయోగించకుండా ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ తొలగించేయాలి. ప్రధానంగా చాలాకాలంగా ఉపయోగించని బట్టలు.
బెడ్రూమ్ కి సంబంధించని వస్తువులు కూడా బెడ్రూమ్ లో ఉండనీయకండి. ఉదాహరణకు టి.వి., వ్యాయమం చేసే సైకిళ్ళు, ట్రెడ్మిల్, కంప్యూటర్, ఆఫీస్ కు సంబంధించిన ఎక్విప్ మెంట్ తదితర సామాగ్రినంతా బెడ్రూమ్ లో ఉండరాదు. ఒకవేళ ఉండడం తప్పనిసరి అయితే నిద్రించే ముందు వాటిని మందపాటి కర్టన్లతో కప్పాలి.
(సేకరణ)
సువర్ణకము
2 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment