Saturday, February 7, 2009

చేతివేళ్ళతో ఆరోగ్యం - 5

నియమం ప్రకారం ముద్రావైద్య సాధనను తెలుసుకొని ఆచరించడం వల్ల ఏ విధమైన రోగాలు దరిచేరవు మరియు రోగమున్నవారు రోగ విముక్తి కలిగించుకోవచ్చు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని పంచతత్త్వముల మధ్యన వచ్చే అసమానతలను తొలగించుట సాధ్యమగును. ఏదైన వ్యాధితో బాధపడేవారుంటే వారు వారి యొక్క మందులను వాడుతూ ఆయా వ్యాధులకు సంబంధించిన ముద్రలను కూడా చేయవచ్చు.



నిమయాలు :

1. ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు గానీ చేయవచ్చును.

2. సాధారణంగా పద్మాసనంలో కూర్చొని ముద్రలు చేపట్టడం శ్రేష్ఠం. కానీ....ఇవి ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రయాణంలో, పడుకొని యున్నా గానీ చేయవచ్చు. కాలినడక తర్వాత అయితే కొంత విశ్రాంతి తర్వాత చేయవచ్చు.

3. ముద్రలు రెండు చేతులతో చేయాలి.

4. ముద్రలను తేలికగా ఎక్కువగా వత్తిడి చేయకుండా అలవాటు చేసుకోవాలి.

5. రెండు చేతులతో ఈ ముద్రలన్నీ వీలుంటే కనీసం 45 నిముషాలు ప్రతిరోజూ అభ్యాసం చేయాలి.

6. శూన్యముద్ర, వాయుముద్రలు (త్వరలో పరిచయం చేస్తాను) మాత్రం రోగం తగ్గేంతవరకు మాత్రమే అభ్యసించాలి.





ప్రారంభ సాధకులు ముందు 10 నిముషాలలో మొదలుపెట్టి రోజూ కొద్ది నిముషాలు పెంచుకుంటూ పోవాలి. తేలికైన ముద్రలను ఉదయం 15 నిముషాలు, సాయంత్రం 15 నిముషాలు క్రమం తప్పక ఆచరించాలి. ఈ వైద్యవిధానంలో విశ్వాసం ఏ మాత్రం లేకపోయినా సాధన వల్ల ఫలితం మాత్రం తప్పక లభిస్తుంది.

0 వ్యాఖ్యలు:

Post a Comment