కుంకుళ్ళ పై బెరడు బాగా నలగగొట్టినది - 100 గ్రా తీసుకొని దాన్ని కొంచెం కొంచెంగా నీరు పొసి ముద్దగా నూరుకోవాలి. వీటిని చిన్న శనగగింజలంత మాత్రలుగా చేసుకొని బాగా గాలికి తగిలే చోట పరిశుభ్రమైన ప్రదేశంలో నీడలో ఆరబెట్టాలి. మొత్తం నీరు అంతా ఆవిరి అయిపోయేలా సుమారు 4,5 రోజులు ఆరబెట్టి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.
సేవించే విధానం:
రక్తమొలలు గలవారు మంచి నీటితో 3 పూటలు ఆహారానికి అరగంట ముందు 1 మాత్రను వేసుకోవాలి.
ఎండుమొలలు గలవారు పలుచని తీయని మజ్జిగతో 3 పూటలు ఆహారానికి అరగంట ముందు 1 మాత్రను వేసుకోవాలి.
అసలు మొలలు ఎందుకు వస్తాయి?
రోజులో ఎక్కువగా కూర్చోనేవాళ్ళకు, మాంసం, మసాలాలు ఎక్కువగా వాడేవారికి, రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారికి, సూర్యోదయం తర్వాత లేచేవాళ్ళకు, టీ, కాఫీలు, మద్యపానం అధికంగా సేవించేవారికి, ప్రకృతి వ్యతిరేక జీవన విధానం వల్ల వస్తాయి.
ఏల్చూరి గారి జీ-తెలుగు కార్యక్రమం నుంచి సేకరించినది.
Emblems
6 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment