ఈ మధ్య ఛానల్స్ లో వస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల అందరూ దూరదర్శన్ చాలా నయం అనే పరిస్థితికి వచ్చారు. కొన్ని బ్లాగుల్లో కూడా దాదాపు అవే భావాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ టపా వ్రాయడానికి కారణం ఈ రొజు TV9లో చూసిన న్యూస్ వాచ్ కార్యక్రమం.
దివంగత ముఖ్యమంత్రి YSR హత్య కుట్ర వగైరాలా గురించి నిన్న కొన్ని ఛానల్స్ చూపిన అత్యుత్సాహం గురించి రజనీకాంత్ + అతిధులు మీడియా ఎలాంటి వార్తలు ప్రసారం చేయాలి?? జర్నలిజం నియమాలు వగైరాలా గురించి చర్చిస్తున్నారు. ఆసక్తి లేకపోయినా ఏదో వింటున్నా.
కార్యక్రమం చివరాఖరున ఓ జోక్ పేలింది.. కోమటరెడ్డి రాజగోపాలరెడ్డి MP గారు.. వాళ్ళ రాజినామాల గురించి TV5కు ఇంటర్యూ ఇచ్చారంట.. వీళ్ళు ఇంకా ఓ నిర్ణయానికి రాకముందే TV5లో రాజినామాల గురించి తప్పుగా స్క్రోలింగ్ వేసారంట. తర్వాత TV9లో NTVలో వేసారంట. ఏంటి అని TV9, NTV కి కాల్ చేస్తే TV5 వాళ్ళు వేస్తున్నారుగా అందుకే మేము వేస్తున్నాం అన్నారంట..
అపుడు కోమటరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు .... ఓ 6 నెలలు ఈ ఛానెల్స్ అన్ని ఆపేసి దూరదర్శన్ లో శాంతిస్వరూప్ ను తీసుకువస్తే 6 వరకూ ఉండి మళ్ళీ పొద్దున్న వస్తాడు.. అని చెప్పారు. రజనీకాంత్ ఉన్నాడని కూడా లేకుండా TV9 స్టూడియోలో ఉండి TV9 వాళ్ళనే గిల్లారు.
మాకు తెలిసినవాళ్ళు టి.వి. కొన్న దగ్గరనుండి ఎంచక్కా దూరదర్శన్ నే చూస్తున్నారు. వాళ్ళకు 55 సంవత్సరాల వయస్సు. కానీ వాళ్ళకు ఇప్పటివరకు షుగర్, బి.పి లాంటివి ఏమీ లేవు. ఇది వరకు మేము వాళ్ళను మూర్ఖులుగా చూసేవాళ్ళం. కానీ అసలు ఒక్కొసారి ఇన్ని ఛానల్స్ పిచ్చెక్కుంది. నేను దూరదర్శన్ మారడానికి రెడీ... ఇంట్లో వాళ్ళు డౌటే
ఆ మధ్య TV5 వాళ్ళు అమృతాన్ని తాగించారు.. ఏదో తివారీ తాత లాంటివాళ్ళు తప్ప మామూలు జనాలు పాపం ఏం ఆరాయించుకుంటారు!! బ్లాగుల్లోనే చాలామంది భళ్ళున కక్కేసారు. సినిమాల్లో అక్కడక్కడా వచ్చేవాటినైనా చూడగలుగుతారేమో కానీ... అన్ని ఒకే చోట పేర్చి మాంచి మసాలా చేసి జనాలకు తినిపిస్తే.. అంతకుముందే కొన్ని ఛానల్స్ తినిపించిన మసాలా మొత్తం ఎక్కువై అందరికి కడుపుల్లో ‘మంట’లు ఎక్కువయ్యాయి.
ఏదో వారానికి ఒక సినిమా, అరగంట చిత్రలహరి, ఓ గంట లేదా రెండు గంటలు సీరియల్స్, అరగంట వార్తలు. ప్రాణానికి హాయిగా ఉంటుందని ఇపుడు అనిపిస్తుంది. ఏం చేస్తాం కడుపులో మంట తగ్గాలంటే మసాలా తగ్గించుకొని మనమే మెనూ మార్చుకోవాలి. ఇలా మెనూ మార్చే క్రమంలో అందరూ మళ్ళీ దూరదర్శన్ కే మారితే, మళ్ళీ అందరి ఇంటి కప్పుల పైనా యాంటెన్నా తల ఎత్తుకొని cable, DTHలను వెక్కిరిస్తూ కనపడుతుందేమో!!
చూద్దాం మా ఇంటి వాళ్ళను నేను ఎంతవరకూ మార్చగలనో!!!
సువర్ణకము
2 months ago
3 వ్యాఖ్యలు:
nijamenandi dooradarshan antene doorapu alochanalato pradarshanalu istundi..
Can't agree with you more.Doordarshan is better.Atleast people will have not worry for stupid reasons
hi
Post a Comment