దారిలోని గులకరాయిని ముందుకు దొర్లిస్తూ
నీ జ్ఞాపకాల దారిలో నా మనసును వెనుకకు మళ్ళిస్తూ..
ఒంటరిగా నడుస్తున్నా....
నా తలపుల్లో నీ అడుగులు నాతో కలసి నడుస్తున్నాయి.
నీ జ్ఞాపకాలు కన్నీళ్ళుగా కరుగుతున్నా...
పదిలంగా నాతోనే ఉంటానంటూ మళ్ళీ నా గుండెలో ఇంకుతున్నాయి.
భౌతికంగా మరణించి
ఆకాశంలో చుక్కలా నువ్వు
మనసు చచ్చి
రెక్కలు తెగిన పక్షిలా నేను
నీతో పాటే నేను చనిపోయాను
గుండె మాత్రం నీ జ్ఞాపకాలతో కొట్టుకుంటుంది.
3 వ్యాఖ్యలు:
ప్రేమకి మృత్యువు లేదు. జ్ఞాపకాలలోని ప్రేమకు అంతం లేదు. మరువలేని ఈ ప్రేమ విగతజీవులని చేస్తుంది. గుండె గొంతుకు తెచ్చిన ఈ ప్రేమ అజరామరం. కవిత బాగుంది అనాలంటే బాధగా ఉంది.
ఎందుకు బాధగా ఉందండి?? ఏక్కడైనా బాగోలేదా?? ఇది 7/G Brindavan COlony సినిమాని ప్రేరణ చేసుకొని రాసినది.
ఇంత బాధపడుతుంటే...ఎలా భరించగలను. ఎవరి బాధనైనా బాగుంది అని ఎలా అనగలము. అదీ దీని భావం... అంతే. మీరు అర్ధం చేసుకుంటారనుకున్నాను.
Post a Comment